Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ పోక్సో కేసు.. జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు.. 17 అకౌంట్లపై వేటు!

భగీరథ్ పోక్సో కేసు.. జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు.. 17 అకౌంట్లపై వేటు!

వార్త 6 days ago

Bandi Bhagirath Case News: పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న బండి భగీరథ్ కేసును విచారించిన హైకోర్టు స్పెషల్ బెంచ్ మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో వచ్చిన అనుచిత పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భగీరథ్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన పక్షంలో సదరు జడ్జి భర్తకు హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి వరిస్తుందని, గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై శుక్రవారం అర్థరాత్రి వరకు విచారణ సాగడం తెలిసిందే. అంతకుముందు నుంచే ఈ పోస్టులు రాగా భగీరథ్ పిటిషన్ తిరస్కరణ తరువాత కూడా ఇవి కొనసాగాయి. ఈ పోస్టులపై హైకోర్టు జడ్జిలు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఇలాంటి పోస్టుల వల్ల తమపై ఒత్తిడి తేవాలనుకోవడం ఎంతమాత్రం సాధ్యం కాదని, అయితే హైకోర్టు పనితీరుపై ప్రజల్లో అప నమ్మకం కలుగుతుందని తెలిపారు.

 Cyber crime police officers in Hyderabad analyzing social media accounts and tracking IP addresses for defamatory posts on a computer screen

దీనిపై హైకోర్టు రిజిస్ట్రీలు చార్మినార్ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే కేసు నమోదుచేసి, దీనిని సైబర్ క్రైం పోలీసులకు బదలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న సైబరైం పోలీసులు జడ్జిలపై పోస్టులు ఉంచిన సోషల్ మీడియా ఖాతాలపై దృష్టిసారించి వారి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భగీరథ్్ప(Bandi Bhagirath Case News) పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు, అనుచిత పోస్టులపై మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సైబరాబాద్ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బాధిత బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు ఉంచడం నేరమని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు మేరకు 17 సోషల్ మీడియా ఖాతాలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు అనుమానిత ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha