Tirupati: పవిత్రక్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తిరసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలని సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతివారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో, నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం ఐదు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది.
Read Also:TTD: అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం సరికొత్త టెక్నాలజీ!
"గోవింద… గోవింద…" అనే నామస్మరణతో మారుమోగే తిరుపతి(Tirupati) వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తుంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో భక్తి భావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి, సేవా భావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోనికి తీసుకువస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునెప్ప గారి మునినాథరెడ్డి వాసుదేవ రెడ్డి గుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి అన్నూరు మునిరత్నమాచారి పురుషోత్తమ యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం కన్నప్ప కేశవులు నాగేశ్వరరెడ్డి, రాజేంద్రన్ ,సుధాకర్ చౌదరి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అరుణమ్మ జయమ్మ, పద్మావతి, కళ్యాణి ,సుశీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

