Vijayawada Kanaka Durga Temple: ఆది దంపతుల నదీవిహారం కమనీయంగా కొనసాగింది. చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను ప్రత్యేక పల్లకీపై వేంచేపు చేసి వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలు, డప్పువాయిద్యాలు, భక్త బృందాల కూచిపూడి నృత్యకేళి, కోలాటాలు, భజన సంకీర్తనలు, సాము గిరికీలు, ఢక్క, ఢమరుక, శంఖనాదాలతో వేడుకగా పవిత్ర కృష్ణా నదీతీరానికి తీసుకొచ్చి అక్కడ సిద్దంగా వుంచిన ప్రత్యేక నావలపై వేంచేపు చేశారు.
Read Also:TTD: అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం సరికొత్త టెక్నాలజీ!
ఈ సందర్భం గా శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య ఆర్యకులు ఆర్. శ్రీనివాస శర్మలు పూజాదికాలు నిర్వహిస్తూ వేదమంత్ర పఠనాలు గావిస్తుండగా ఆదిదంపతుల నదీవిహా రం ముమ్మార్లు జరిపించారు. ఆనంతరం రాత్రి 7.30 గంటలకు పవళింపు సేవ, ద్వాదశప్రదక్ష ణలు, పుష్పయాగ శయనోత్సవం నిర్వహించారు. వేడుకగా ద్వాదశ ప్రదక్షణలు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు ద్వాదశ ప్రదక్షణలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచావాయి ద్యాలు, వేదపఠనము, రుద్ర సూక్తము, స్తోత్ర పఠనము, భేరినాదాలు, కాహాలకము (కొమ్ము బూర), కాంస్యనాదము, వీణానాదము, మురళీ నాదము, గానము, నృత్యము, మౌనము వంటి ద్వాదశ క్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Vijayawada Kanaka Durga Temple
అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు. తదుపరి అద్దాల మండపంలో శ్రీస్వామి అమ్మవార్లను వేంచేపు చేసి, పవళింపు సేవ జరిపారు. కార్యక్రమంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఓ వికె శీనా నాయక్, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చక స్వాములు,
ఆలయాధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యాల కోసం ఇఓ ప్రత్యేక చర్యలు:
దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు సౌకర్యాలు పెంచే దిశగా ఇఓ వికె శీనా నాయక్ పలు చర్యలు చేపట్టారు. రథం సెంటర్ వద్ద ప్రత్యేక ప్రసాదాల విక్రయాలు, ఘాట్ రోడ్డుపై శ్రీఅమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల విక్రయాల కౌంటర్ ఏర్పాటు చేయించారు. వృద్దులు, వికలాంగులు దుర్గమ్మవారిని దర్శించుకోటానికి ప్రత్యేక టైం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆయన ప్రసాదాల కౌంటర్లో ప్రసాదాల బరువు, నాణ్యతను పరిశీలించారు. ఘాట్ రోడ్డు నుండి గాలిగోపురం వరకు క్యూలైన్లు పరిశీలించి క్రమబద్ధీకరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది పనితీరు గమనించి వారికి పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా భక్తులో మర్యాదతో మెలగాలని ఆదేశించారు. శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా వుండడంతో అంతరాలయ దర్శన టికెట్లు అమ్మ కాలు నిలిపేసి త్వరితంగా దర్శనమయ్యే చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు బిస్కట్లు, మంచినీటి పంపిణీ చేయించారు. క్యూలైన్లలో భక్తులకు బిస్కట్లు, మజ్జిగ పంపిణీ త్వరలో చేపడతామని ఈ సందర్భంగా ఇఓ తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దుర్గమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు రు.1,01,116ల విరాళం అందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

