Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భక్తుల కోసం ఇంద్రకీలాద్రి పై AI టెక్నాలజీ ?

భక్తుల కోసం ఇంద్రకీలాద్రి పై AI టెక్నాలజీ ?

వార్త 1 week ago

AI Services in Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దేవస్థానం లో త్వరలో AI సేవలు అందుబాటులోకి రానున్నాయి.భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా, దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు దేవస్థానం అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

ప్రతిరోజూ సుమారు 70 వేల మంది భక్తులు, పండుగ రోజుల్లో లక్షలాది మంది తరలివచ్చే ఇంద్రకీలాద్రిపై రద్దీని తగ్గించడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఏఐ సాంకేతికతను వాడనున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా ఏ సమయంలో ఎంతమంది భక్తులు వస్తారు? ఏ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది? వంటి అంశాలను ముందుగానే అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది.

Read Also: AP BJP New Presidents: కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం!

AI Services in Indrakeeladri: భక్తుల మొబైల్‌కే దర్శనం సమాచారం

ఈ కొత్త విధానం అమలులోకి వస్తే భక్తులకు తమ మొబైల్ ఫోన్లలోనే కీలక సమాచారం అందుతుంది దర్శనానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఆలయంలో ఏ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉందో సమాచారం అందుతుంది. పార్కింగ్ ఎక్కడ ఖాళీగా ఉంది? లడ్డూ కౌంటర్ల వద్ద వెయిటింగ్ ఎంత? వంటి వివరాలు ఏఐ ద్వారా భక్తులకు చేరుతాయి. ఏ సమయంలో వెళ్తే దర్శనం త్వరగా పూర్తవుతుందో కూడా సిస్టమ్ సూచిస్తుంది.

భద్రతకు ఏఐ కెమెరాల పహారా

కేవలం దర్శనానికే కాకుండా భద్రత పరంగా కూడా ఏఐ సాంకేతికత కీలకం కానుంది. ఆలయ పరిసరాల్లో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను కనిపెట్టడం, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం వంటి పనుల కోసం ఏఐ కెమెరాలను వాడే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. తిరుమలలో ఇప్పటికే సక్సెస్ అయిన ఈ హైటెక్ విధానం, ఇప్పుడు బెజవాడ దుర్గగుడిలో కూడా భక్తులకు మెరుగైన అనుభూతిని అందించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏపీ పర్యాటక శాఖకు అరుదైన అవార్డ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha