Medak crime: తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్యను ప్రేమ గా చూసుకోవాల్సిన భర్తే కాలయముడయ్యాడు. కడుపుతో ఉన్నదనే జాలి కూడా లేకుండా ఆమెను అనుమానంతో వేధింపులకు గురిచేశాడు.
గర్భస్థ శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తానంటూ శారీరకంగా, మానసికంగా హింసించాడు. చివరకు భర్త, అత్త వేధింపులు తాళలేక ఆ గర్భిణి ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన గాజుల సుస్మిత (23)కు, అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన గాజుల అభిలా్‌షతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణి.
Pregnant woman commits suicide due to harassment by husband and mother-in-law.
Medak crime: డీఎన్‌ఏ టెస్ట్ పేరిట మానసిక వేధింపులు
సుస్మిత గర్భం దాల్చినప్పటి నుంచి భర్త అభిలాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెపై తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదేనా కాదా అంటూ డీఎన్‌ఏ (DNA) టెస్ట్ చేయించాలంటూ నిత్యం గొడవపడేవాడు. దీనికి తోడు అత్త శశిరేఖ కూడా అభిలాష్‌కు తోడై సుస్మితను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టింది. నిత్యం జరుగుతున్న ఈ అవమానాలను, వేధింపులను సుస్మిత భరించలేకపోయింది. భర్త, అత్త పెడుతున్న బాధలను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడుపులోని ఐదు నెలల పసికందుతో సహా ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని.. భర్త అభిలాష్, అత్త శశిరేఖలే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ సుస్మిత తల్లి జనబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com

