Mahabubabad crime: కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాలు కూడా మారిపోతున్నాయా అనిపించే ఘటన ఇది. కేవలం భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో ఓ యువ వివాహిత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం విషాదాంతంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త ఫోన్ కాల్ ఎత్తలేదనే చిన్న కారణంతో మనస్తాపానికి గురైన ఒక యువతి క్షణికావేశంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.
Read Also: Baghpat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి!
Such a drastic decision just because her husband didn’t answer the phone?
Mahabubabad crime: పుట్టింట్లో ఉన్న సమయంలో వీడియో కాల్ వివాదం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిలకు రెండేళ్ల క్రితం మహబూబాబాద్‌లో హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న బాణోత్ హుస్సేన్‌తో వివాహమైంది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల, ఈ నెల 2న తన చిన్నారి ఏడుస్తుండటంతో భర్తకు చూపించి మాట్లాడించాలనే ఉద్దేశంతో వీడియో కాల్ చేసింది. అయితే, ఆ సమయంలో హుస్సేన్ కాల్ ఎత్తకపోవడంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందింది.
అత్తగారింటికి వచ్చి ఎలుకల మందు తిన్న యువతి
భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే మహబూబాబాద్‌లోని తన అత్తగారింటికి చేరుకున్న అఖిల, తీవ్ర ఆవేదనతో ఎలుకల మందు పేస్ట్ తిని ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె, పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Epaper: epaper.vaartha.com

