Dailyhunt
భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

వార్త 1 week ago

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన రూపాన్ని చూసి అసహ్యించుకోవడం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చాటిచెబుతోంది.ఏప్రిల్ 7న సుగంధ ద్రవ్యాల వ్యాపారి దేవకృష్ణ పురోహిత్ (28) తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు.భార్య ప్రియాంక పురోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ..

దొంగలు ఇంట్లోకి చొరబడి నగదు, నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేసి తనను కట్టేశారని నమ్మబలికింది.

Read Also:TTD Fake Tickets: త్వరితగతిన శ్రీవారి దర్శనమంటూ భారీగా డబ్బులు వసూళ్లు చేసిన వ్యక్తి గుట్టురట్టు

Madhya Pradesh Crime: దొంగతనం డ్రామా

దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడంతో పోలీసులకు ప్రియాంకపై అనుమానం కలిగింది. దీనికితోడు దేవకృష్ణ సోదరి ఇచ్చిన వాంగ్మూలం కేసును మలుపు తిప్పింది. “నువ్వు నల్లగా ఉన్నావు, నీకంటే అందగాడు నాకు దక్కాలి” అంటూ ప్రియాంక తరచూ తన భర్తను అవమానించేదని ఆమె తెలిపింది. దేవకృష్ణ నల్లగా ఉంటాడని, అతడు తనకు సరిపోడని ప్రియాంక నిత్యం వేధించేది. తనకంటే అందగాడు కావాలని కోరుకునేది.ఈ క్రమంలోనే తనకు ఉన్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని, ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం పదునైన ఆయుధంతో అతడిని చంపేసింది.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంకకు కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకోవడానికి కమలేష్ స్నేహితుడైన సురేంద్ర భట్‌కు లక్ష రూపాయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా రూ. 50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించింది. హత్యలా కాకుండా దోపిడీలా కనిపించేలా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన సురేంద్ర, నిద్రిస్తున్న దేవకృష్ణపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. ప్రస్తుతం పోలీసులు ప్రియాంకను, ఆమె ప్రియుడు కమలేష్‌ను అరెస్ట్ చేయగా, సుపారీ తీసుకున్న సురేంద్ర పరారీలో ఉన్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు: మెలానియా ట్రంప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha