Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్త సూరజ్‌ నంబియార్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన నటి మౌనీ రాయ్

భర్త సూరజ్‌ నంబియార్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన నటి మౌనీ రాయ్

వార్త 1 week ago

Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఈ అధికారిక ప్రకటనతో తెరపడింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్టు ద్వారా అభిమానులతో పంచుకున్న ఆమె, పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపినట్లు సమాచారం. మౌనీరాయ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2022లో అట్టహాసంగా వివాహం

మౌని రాయ్, 2022 జనవరి 27న గోవాలో సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలలో హల్దీ, సంగీత్ కార్యక్రమాలతో పాటు, సాంప్రదాయ మలయాళీ, బెంగాలీ వివాహ పద్ధతులు కూడా జరిగాయి. వివాహానంతర పూల్ పార్టీతో ఈ వేడుకలు ముగిశాయి. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. అతడు దుబాయ్ లో నివసిస్తున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణం అదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha