Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణం అదే!

నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణం అదే!

వార్త 3 months ago

Nithya Menen : సినీ కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలు తనను మానసికంగా ఎంతో పరిణతి చెందేలా చేశాయని ప్రముఖ నటి నిత్యామీనన్ అన్నారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి గతంలో జరిగిన ఒక వివాదం తనలో లోకజ్ఞానాన్ని పెంచిందని ఆమె పేర్కొన్నారు.

ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు “ప్రభాస్ ఎవరు?” అని ఆమె ఇచ్చిన సమాధానం అప్పట్లో పెద్ద దుమారానికే దారి తీసిన సంగతి తెలిసిందే.

అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు

ఆ సమయంలో తాను చాలా అమాయకంగా ఉండేదానని, కేవలం ఒక్క మాటను పట్టుకుని కొంతమంది రాద్ధాంతం చేయడం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని నిత్యా ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయతీని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదనే పాఠాన్ని నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మన మనసులోని స్వచ్ఛతకు అర్హులు కారని తనకు ఆలస్యంగా అర్థమైందని తెలిపారు.

Read Also:Sugar Export Ban India: భారత్ నుంచి చక్కెర ఎగుమతులు నిలిపివేత

 Nithya Menen

రెండేళ్ల విరామం.. కొత్త జీవితం

ఈ వివాదాల కారణంగా తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని, కొన్ని ఫేక్ ఫొటోలు సృష్టించి తనను కృంగదీసే ప్రయత్నం చేశారని ఆమె వాపోయారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఆ విరామ సమయంలోనే లోకజ్ఞానాన్ని పెంచుకున్నానని, అప్పటి నుంచి మనుషులను అంచనా వేయడంలో మరియు లౌక్యంగా మాట్లాడడంలో తన పంథాను మార్చుకున్నానని నిత్యామీనన్ వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నీట్ రద్దు చేయండి.. 12వ తరగతి మార్కులే ప్రామాణికం కావాలి: సీఎం విజయ్ డిమాండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha