Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్తను చంపేందుకు భార్య సినిమా ప్లాన్.. సీన్ రివర్స్ కావడంతో బయటపడిన బాగోతం!

భర్తను చంపేందుకు భార్య సినిమా ప్లాన్.. సీన్ రివర్స్ కావడంతో బయటపడిన బాగోతం!

వార్త 2 months ago

Kadapa Crime: ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి నాగసుధీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది.

విషయం తెలుసుకున్న భర్త ఈశ్వర్ రెడ్డి ఆమెను తీవ్రంగా మందలించారు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న శిల్పారెడ్డి, తన ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ వేసింది.

Read also: Hyderabad Fake Tea Powder: కల్తీ టీ పొడి గుట్టురట్టు.. 3 వేల కిలోలు సీజ్ చేసిన H-FAST బృందం!

 Police arresting woman for crime plan

Kadapa Crime: ప్రియుడికి బంగారం.. రౌడీ షీటర్లతో ఒప్పందం

హత్య కోసం ఓ కిరాయి ముఠాతో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డబ్బు కోసం శిల్పారెడ్డి తన దగ్గరున్న 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. అతను ఆ నగలను అమ్మి ముఠాకు అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు చెల్లించాడు. భర్త కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తూ, పథకం ప్రకారం బుధవారం బైపాస్ రోడ్డులో ఈశ్వర్ రెడ్డిని కారుతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేసేలా ప్లాన్ చేశారు.

సినిమా లెవల్ ట్విస్ట్.. ప్రాణాలతో బయటపడ్డ భర్త

దుండగులు కారుతో ఢీకొట్టి దాడికి దిగినా, ఈశ్వర్ రెడ్డి అప్రమత్తంగా వ్యవహరించి వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు భార్య శిల్పారెడ్డి, ప్రియుడు నాగసుధీర్ ప్లాన్‌ను కనిపెట్టి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. కారణం ఇదే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha