Haryana Crime: హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో అత్యంత దారుణమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. పీహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ్, విమలా దేవి దంపతులు ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
రాజేశ్ స్థానికంగా ఉన్న ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారి ఇల్లు ఉన్న టెర్రస్ ప్రాంతం నుంచి పెద్దగా గొడవ, అరుపులు వినిపించడంతో ఏమైందో చూసేందుకు ఇంటి యజమాని రింకూ పైకి వెళ్లాడు.
పైకి వెళ్లిన యజమాని రింకూకు అక్కడ కనిపించిన భయానక దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. రాజేశ్ రక్తపు మడుగులో పడి ఉండగా, అతని పొట్ట భాగం తీవ్రంగా చీల్చి ఉంది. బయటకు వచ్చిన పేగులను విమల ఒక సంచిలో పెడుతుండటం రింకూ గమనించాడు. అదే సమయంలో తనను ఇంటి యజమాని చూశాడని గ్రహించిన విమల, కంగారుతో భయపడి టెర్రస్‌పై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Read Also : Chandigarh : భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Wife hacks husband to death and slits open his abdomen… then stuffs his body parts into a bag…
Haryana Crime: పోస్టుమార్టంలో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు.. మాయమైన కిడ్నీ, కాలేయం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని 3 వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. రాజేశ్ పొట్టపై సుమారు 35 సెంటీమీటర్ల పొడవున కోసి ఉంది. అంతేకాకుండా అతని శరీరం నుంచి కాలేయంలో (Liver) కొంత భాగం, కుడివైపు ఉన్న కిడ్నీ (Kidney) మాయమైనట్లు వైద్యులు స్పష్టంగా గుర్తించారు.
క్షుద్రపూజల కోణంలో దర్యాప్తు - విమల కోలుకుంటేనే అసలు నిజాలు
విమల గతంలో క్షుద్రపూజలు, చేతబడి వంటి మూఢనమ్మకాల పద్ధతులు చేస్తుండేదని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ తీవ్ర గొడవలు జరుగుతుండేవని ఇంటి యజమాని పోలీసులకు వెల్లడించాడు. కొన్నేళ్ల క్రితం వివాహమైనా ఈ దంపతులకు సంతానం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితురాలు విమల కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం ఇస్తేనే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, మాయమైన అవయవాల వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగ వేటలో తీవ్ర ఒత్తిడి.. అమెరికాలో హైదరాబాద్ వాసి ఆత్మహత్య

