Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భట్టిపై MP రేణుకా చౌదరి ఆగ్రహం

భట్టిపై MP రేణుకా చౌదరి ఆగ్రహం

వార్త 3 months ago

మ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన అనుచరులకే పెద్దపీట వేశారని రేణుకా చౌదరి వర్గం ఆరోపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు మొండిచేయి ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కని అసంతృప్త నేతలతో కలిసి రేణుకా చౌదరి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జిల్లాలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లకు గౌరవం లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read Also : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోస్టల్ ఐపీ అధికారి అరెస్ట్

టీపీసీసీకి ఫిర్యాదు – రచ్చకెక్కిన వర్గ విభేదాలు

ఇన్నాళ్లు జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు గాంధీ భవన్ వరకు చేరాయి. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు రేణుకా చౌదరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమన్వయం లేకుండా నామినేటెడ్ పదవుల పంపిణీ జరగడం వల్ల కేడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి ఉద్ధండులు ఉన్నప్పటికీ.. సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గ పోరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోనని హైకమాండ్ ఆందోళన చెందుతోంది.

హాట్ టాపిక్‌గా మారిన ఖమ్మం రాజకీయం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో ఈ గొడవలు బయటపడటం కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది. ఒకవైపు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నామని చెబుతున్నా, అంతర్గత కలహాలు మాత్రం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎంపీ రేణుకా చౌదరి నేరుగా డిప్యూటీ సీఎంపైనే గురి పెట్టడంతో అధిష్టానం ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందో చూడాలి. ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

డేవిడ్ పేరున్న వారికి నెహ్రూ జూ పార్కులోకి నేడు ఉచిత ప్రవేశం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha