Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోస్టల్ ఐపీ అధికారి అరెస్ట్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోస్టల్ ఐపీ అధికారి అరెస్ట్

వార్త 3 months ago

ఐపీ అధికారి గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ…

CBI raids Wanaparthy: వనపర్తి జిల్లాలో సీబీఐ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఐపీ అధికారి గోపీనాథ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

సీబీఐకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని గోపీనాథ్‌ను పట్టుకున్నట్టు సమాచారం.

Read Also : BC Caste Names Change: తెలంగాణలో బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే!

 Postal officer caught by CBI while taking bribe

CBI raids Wanaparthy: లక్షల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణ..

లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పోస్టల్ శాఖలో పలు పథకాలకు సంబంధించిన పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం ఐపీ అధికారి గోపీనాథ్ లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి అతడిని పట్టుకున్నారు.పోస్టల్ శాఖకు సంబంధించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. లక్షల రూపాయల నిధులను గోపీనాథ్ స్వాహా చేసినట్టు అనుమానిస్తున్నారు.అతడి కార్యాలయం, నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనతో పోస్టల్ శాఖలో కలకలం రేగింది. సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha