Dailyhunt
భవానీపూర్ నుంచే నా ప్రస్థానం మొదలైంది: నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ

భవానీపూర్ నుంచే నా ప్రస్థానం మొదలైంది: నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ

వార్త 1 week ago

Mamata Banerjee Nomination: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హై-ప్రొఫైల్ పోరుకు తెరలేచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

కాళీఘాట్‌లోని తన నివాసం నుండి అలీపూర్ సర్వే బిల్డింగ్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించిన అనంతరం ఆమె నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Read Also:Amazon Layoffs: 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్

మినీ ఇండియాగా భవానీపూర్.. భారీ రోడ్‌షో

వేలాదిమంది మద్దతుదారులు ‘మమతా బెనర్జీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తుండగా, సుమారు 800 మీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు. చేతులు జోడించి, చిరునవ్వుతో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. “నేను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతిదీ ఇక్కడి నుంచే మొదలైంది” అని ఆమె మీడియాకు తెలిపారు. బెంగాల్ యొక్క వైవిధ్యభరిత సంస్కృతికి భవానీపూర్ నిదర్శనమని, ఇక్కడ బెంగాలీలు, గుజరాతీలు, పంజాబీలు, ముస్లింలు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారని, ఇది ఒక ‘మినీ ఇండియా’ అని టీఎంసీ అభివర్ణించింది.

Mamata Banerjee Nomination: ఓటర్ల జాబితాపై మమత ఆందోళన: కోర్టుకు వెళ్తామని హెచ్చరిక

నామినేషన్ వేసిన అనంతరం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా నుండి పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించడం, ఓటర్ లిస్ట్‌ను ఫ్రీజ్ చేయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, దీనిపై తాము మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీ, ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

 Mamata Banerjee Files Nomination from Bhabanipur

సువేందు అధికారితో హోరాహోరీ పోరు

ఈసారి భవానీపూర్ బరిలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి తలపడుతున్నారు. దీంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేషన్ కార్యక్రమంలో మమత వెంట కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీం భార్య రూబీ హకీం, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23 మరియు 29వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ రాకపోయినా విగ్రహంతో నామినేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha