Tamil Nadu Elections 2026: తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనే నిదర్శనం. తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఇందులో భాగంగా తిరువేరుంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవల్పట్టు విజి, తన నామినేషన్ దాఖలు చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
Read Also: Sabarimala Case: 2018 తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో విన్నపం!
Tamil Nadu Elections 2026: పక్కనే కూర్చోబెట్టుకుని ఊరేగింపుగా..
నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన అభిమాన నాయకుడు విజయ్ తన వెంట ఉండాలని విజి ఆశించారు. అయితే విజయ్ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో, విజి ఏకంగా విజయ్ రూపురేఖలతో కూడిన ఒక మైనపు విగ్రహాన్ని (Wax Statue) తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని తన వాహనంలో పక్కనే కూర్చోబెట్టుకుని, అభిమానుల కోలాహలం మధ్య ఊరేగింపుగా వెళ్లారు.
విజయ్ స్వయంగా తన పక్కనే కూర్చున్నారన్నంత రేంజ్‌లో ఆ విగ్రహం ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.ఈ విగ్రహం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ''నిజమైన విజయ్ రాకపోతే ఏంటి.. మా గుండెల్లో ఉన్న దైవం విగ్రహం రూపంలో వచ్చారు'' అని కొందరు అంటుంటే, ఎన్నికల ప్రచారం కోసం ఈ డూప్ విజయ్ రాజకీయాలు ఏంటి? అని మరికొందరు విమర్శిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

