Construction Water Ban:హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత రాకుండా 3 మున్సిపల్ కార్పొరేషన్లు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ భవన నిర్మాణాలకు తాగునీరు నిషేధం విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన శుక్రవారం నీటి పొదుపుపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. నిర్మాణ సంస్థలు నీటి పొదుపు నియమాలను పాటించేలా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాల పనితీరును స్వయంగా పరిశీలించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజిగిరి కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి నీటి సంరక్షణ పనులను ప్రారంభించారు.
Elnino Effect: ఫిబ్రవరి నుంచే మండనున్న ఎండలు
Drinking water prohibited for construction projects
339 ప్రైవేట్ ఎస్టీపీలకు మున్సిపల్ షాక్! పనిచేయకపోతే ఎంత జరిమానా?
గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్న 339 మురుగునీటి శుద్ధి కేంద్రాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ 339 ఎస్టీపీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సిబ్బంది తనిఖీలు చేస్తారు. మురుగునీటి శుద్ధి యంత్రాలు పనిచేయకపోతే సదరు యాజమాన్యాలకు భారీగా జరిమానాలు విధిస్తారు. గేటెడ్ కమ్యూనిటీల పరిధిలోని పార్కులు, పచ్చదనం పెంచడానికి ఏ రకమైన నీటిని వాడుతున్నారో వివరాలు నమోదు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాగునీటి వృథాను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం.
Construction Water Ban:రోడ్లు పార్కుల నిర్మాణాలకు ఇకపై ఏ నీరు వాడాలి? భారీ జరిమానాలు ఎవరికి?
తాగునీటిని వాహనాలు కడగడానికి, రోడ్ల పై చల్లడానికి ఉపయోగిస్తే జరిమానా వేస్తారు. బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలకు మంచి నీరు లేదా బోరు నీటిని వాడకూడదు. పార్కులు, రోడ్డు డివైడర్ల మొక్కలకు కేవలం రీసైకిల్ చేసిన శుద్ధి నీటిని మాత్రమే వాడాలి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, గేటెడ్ కమ్యూనిటీలు శుద్ధి చేసిన నీటినే తమ పనులకు ఉపయోగించాలి. ఈ నిబంధన మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేసే అన్ని విభాగాలకు వర్తిస్తుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ముంపు ప్రాంతాల్లో దశలవారీగా ఇంకుడు గుంతలు తవ్వుతారు.
Epaper: epaper.vaartha.com

