IPL: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన భవిష్యత్ అంచనాలతో చర్చకు తెరలేపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా ఉన్న ఐపీఎల్, 2030 నాటికి అగ్రస్థాయి అంతర్జాతీయ క్రీడలైన ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ లీగ్‌లతో పోటీ పడబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Shreyas Iyer IPL Record: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్
IPL: ఫ్రాంచైజీల బడ్జెట్ 7 రెట్లు పెరుగుదల?
లలిత్ మోదీ అంచనా ప్రకారం, రాబోయే నాలుగేళ్లలో ఐపీఎల్ జట్ల ఆర్థిక బలం గణనీయంగా పెరగనుంది.టాప్ ప్లేయర్లు ఆడే ఒక్కో మ్యాచ్ విలువ సుమారు 1 మిలియన్ డాలర్లు (₹8.5 నుండి ₹9 కోట్లు) ఉండవచ్చని విశ్లేషించారు.ప్రస్తుతం ఒక్కో ఫ్రాంచైజీకి ఉన్న దాదాపు ₹125 కోట్ల (Salary Cap) బడ్జెట్, 2030 నాటికి 100 మిలియన్ డాలర్లకు (సుమారు ₹932 కోట్లు) చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Lalit Modi IPL Predictions 2030
150 కోట్ల ప్లేయర్.. జాకబ్ బెథెల్!
ఈ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఒక ప్రత్యేకమైన పేరును ప్రస్తావించారు. ఇంగ్లాండ్ యువ సంచలనం, ప్రస్తుతం ఆర్సీబీ (RCB) తరపున ఆడుతున్న జాకబ్ బెథెల్ (Jacob Bethell) భవిష్యత్తులో ₹150 కోట్ల ($16 Million) పారితోషికం తీసుకునే స్థాయికి ఎదుగుతాడని ఆయన జోస్యం చెప్పారు. ప్లేయర్లు తమ జాతీయ జట్ల కంటే ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన
ఐపీఎల్ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో, టెస్ట్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. కేవలం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మినహా మిగిలిన దేశాల్లో టెస్ట్ ఫార్మాట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని, దానిని కాపాడాలంటే టెస్ట్ క్రికెట్‌ను కూడా ప్రైవేటీకరించాలని ఆయన సూచించారు.
కోట్ల రూపాయలు ఆర్జించే రోజులు
ఒకవేళ లలిత్ మోదీ అంచనాలు నిజమైతే, వైభవ్ సూర్యవంశీ, జాకబ్ బెథెల్ వంటి యువ ఆటగాళ్లకు అది గొప్ప వరంగా మారనుంది. దీర్ఘకాలం పాటు లీగ్‌లో కొనసాగే అవకాశం ఉన్న యంగ్ టాలెంట్‌కు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. కేవలం స్టార్ ప్లేయర్లు మాత్రమే కాకుండ.. సాధారణ ఆటగాళ్లు కూడా ప్రతి మ్యాచ్‌కూ కోట్ల రూపాయలు ఆర్జించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రేజ్, విపరీతమైన పోటీనే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

