Dailyhunt
డాక్యుమెంటరీతో బయటపడ్డ వరల్డ్ కప్ ఫిక్సింగ్ భాగోతం!

డాక్యుమెంటరీతో బయటపడ్డ వరల్డ్ కప్ ఫిక్సింగ్ భాగోతం!

వార్త 5 days ago

T20 World Cup Fixing: భారత్ విజేతగా నిలిచిన 2026 టీ20 ప్రపంచకప్‌ విజయవంతంగా ముగిసినప్పటికీ, ఈ టోర్నీపై ఫిక్సింగ్ మరకలు పడటం క్రీడాభిమానులను కలవరపెడుతోంది.

ఫిబ్రవరి 17న చెన్నై వేదికగా న్యూజిలాండ్ మరియు కెనడా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విచారణకు దారితీశాయి.

Read Also:Jasprit Bumrah: ఐదు మ్యాచ్‌లు.. సున్నా వికెట్లు: బుమ్రా పై ముంబై ఇండియన్స్ ఆందోళన

ఆ ఐదో ఓవర్‌లో ఏమైంది?

కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఇప్పుడు ప్రధాన అనుమానాలకు కేంద్రబిందువుగా మారింది. ఒక అంతర్జాతీయ స్థాయి బౌలర్, పైగా కెప్టెన్ హోదాలో ఉండి.. వరుసగా వైడ్లు, నోబాల్స్ వేస్తూ ఆ ఒక్క ఓవర్‌లోనే 15 పరుగులు సమర్పించుకోవడంపై నిఘా వర్గాలు మండిపడుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక పొరపాటు కాదు, బుకీల వ్యూహంలో భాగమేనని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

 , Canada vs New Zealand Chennai Match

T20 World Cup Fixing: డాక్యుమెంటరీతో బట్టబయలు

ఈ ఫిక్సింగ్ వ్యవహారం ఒక పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి వచ్చింది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని అసాధారణ పరిణామాలు, ఆటగాళ్ల మధ్య జరిగిన సంభాషణలు ఈ డాక్యుమెంటరీలో కీలకంగా మారాయి. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా, జట్టు ఎంపిక ప్రక్రియలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కాదని, కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం జట్టు కూర్పును మార్చినట్లు సమాచారం.

బోర్డు అధికారుల హస్తం

కెనడా క్రికెట్ బోర్డుకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ అవినీతిలో భాగస్వాములైనట్లు సమాచారం.జట్టు ఎంపికలో అధికారుల ఒత్తిడి ఉందన్న వార్తలు క్రీడా పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే చెన్నైలోని స్టేడియం రికార్డులను, బ్రాడ్కాస్ట్ ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. కెప్టెన్ బజ్వా ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల సాయం

క్రికెట్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ విచారణలో ఫిక్సింగ్ జరిగినట్లు తేలితే, సదరు ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీని వెనుక ఉన్న బుకీల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి స్థానిక పోలీసుల సాయం కూడా తీసుకోనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రభంజనం..పాయింట్ల పట్టికలో టాప్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha