Dailyhunt
భవిష్యత్తులో ఇరాన్, అమెరికా ఏం చేయబోతున్నాయి?

భవిష్యత్తులో ఇరాన్, అమెరికా ఏం చేయబోతున్నాయి?

వార్త 1 week ago

స్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఏ ఒప్పందం లేకుండానే ముగియడంతో, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతి సాధ్యమా అనే ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి.

పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు చర్చలకు ముందు ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల కంటే భిన్నంగా తమపై రెండు పక్షాలకూ నమ్మకం ఉందని అన్నారు. అమెరికా ప్రతినిధి బృందం నాయకుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఆశావహంగా ఉన్నప్పటికీ, ఆదివారం రాత్రి వరకు జరిగిన చర్చల అనంతరం, ఎటువంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించారు. కాబట్టి ఈ పరిస్థితి యుద్ఘాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇందులోని ప్రధాన పాత్రధారుల ముందున్న ఎంపికలు ఏంటి?

Read Also: Hormuz strait tension : హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్

 Iran-America War

Iran-America War: తెహ్రాన్ మా షరతులకు అంగీకరించాలి

ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు 1979 విప్లవం తర్వాత ఇరాన్-అమెరికా మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు. ఇలాంటి దౌత్యాన్ని ఒక్క రోజులో చేయలేరు. చర్చలు మొదలయ్యే ముందు నుంచే ఇది త్వరగా ముగిసే ప్రక్రియ కాదని సంకేతాలు కనిపించాయి. “అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎప్పుడూ కఠినమైన భాషను ఉపయోగించారు. ఇరాన్ ఓడిపోయిందని, ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ అన్నారు. వాన్స్ కూడా అదే తరహాలో “తెహ్రాన్ మా షరతులకు అంగీకరించాలి” అని అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల నుంచి కొన్ని సానుకూల సంకేతాలు ఉన్నాయని బ్రిటన్ మాజీ ఇరాన్ రాయబారి నికోలస్ హాప్టన్ భావిస్తున్నారు. “రెండు పక్షాలు ఈ చర్చలను నిర్మాణాత్మకంగా నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. రోజులో చాలా సేపు చర్చించారు. ఆ చర్చల్లో సాంకేతిక వివరాలు, అలాగే సాధారణ అంశాలపై కూడా లోతైన చర్చలు జరిగాయి” అని ఆయన అన్నారు.
ఇస్లామాబాద్‌లో “గరిష్ఠ డిమాండ్లు” పెట్టుకున్నప్పటికీ, వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయని రెండు పక్షాలు భావిస్తున్నట్టుగా ఆయన చెబుతున్నారు.

బంతి ఇప్పుడు అమెరికా కోర్టులో ఉంది

ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి వెంటనే ఉద్రిక్తతలు పెరుగుతాయా అనే ప్రశ్నకు కొంతమంది నిపుణులు లేదు అని సమాధానమిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం, నాయకత్వ నిలకడ, యురేనియం నిల్వలు వంటి అంశాల కారణంగా ఇరాన్ ఇంకా అమెరికాపై ప్రభావం చూపే బలమైన స్థితిలోనే ఉందని వారంటున్నారు. చర్చలు విఫలమవడంతో ట్రంప్ నేవల్ బ్లాకేడ్‌కు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇది జనవరిలో వెనెజ్వెలా మాజీ అధ్యక్షుడు నికొలాస్ మదురోను తొలగించే ముందు కనిపించిన పరిస్థితితో సమానమని అంటున్నాయి. దీనికి సూచనగా.. చర్చలు కొనసాగుతున్న సమయంలోనే హార్ముజ్ జలసంధిని తెరవడానికి సురక్షిత సముద్ర మార్గం ఏర్పాటు చేయడం గురించి అమెరికా సైనిక ఉన్నతాధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రపంచ చమురు రూట్‌పై అధికారం కోసం పోటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha