Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

వార్త 6 days ago

Chandrababu Naidu: విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రేపు (ఆగస్టు 1) దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్ట్ పనుల పురోగతిని ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

తెలుగు సంస్కృతి, ‘థింసా’ నృత్య ప్రదర్శనకు పెద్దపీట

ఈ విమానాశ్రయ ప్రాంగణాన్ని అచ్చమైన తెలుగు సంస్కృతి మరియు వారసత్వ వైభవం ఉట్టిపడేలా సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయానికి ప్రతీక అయిన ‘థింసా’ నృత్యాన్ని ప్రారంభోత్సవ వేదికపై కళ్లుచెదిరే రీతిలో ప్రదర్శించాలని సూచించారు. విచ్చేస్తున్న ప్రధానమంత్రికి అత్యంత ఘనంగా మరియు ఆచారబద్ధంగా స్వాగతం పలకాలని అధికారులను అప్రమత్తం చేశారు.

Chandrababu Naidu: సమీక్షలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు సంబంధిత జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ రోజే సస్పెన్షన్‌కు గురైన ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha