Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో రాకపోకలు మొదలుకానున్నాయి.
ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా, ఆగస్టు 17వ తేదీ నుంచి అధికారికంగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా వెల్లడించింది.

ప్రధాన నగరాలకు ఎయిరిండియా సర్వీసులు
ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు అమలులో ఉండేలా ఎయిరిండియా తన ప్రత్యేక తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ప్రణాళిక ప్రకారం భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నగరాలకు విమాన రాకపోకలు సాగనున్నాయి.
Bhogapuram Airport: రూట్ల వారీగా విమానాల సంఖ్య వివరాలు
ఎయిరిండియా విడుదల చేసిన వివరాల ప్రకారం, భోగాపురం – హైదరాబాద్ మధ్య నిత్యం 5 విమాన సర్వీసులు నడుస్తాయి. అలాగే భోగాపురం – విజయవాడ మధ్య రోజువారీగా 4 సర్వీసులు, భోగాపురం – బెంగళూరు మధ్య రోజుకు 2 సర్వీసులు ఉంటాయి. ఇక బెంగళూరు మార్గంలో ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసు కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రయాణికులకు ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడనుంది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

