Bhogapuram Airport : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, దాని శ్రేయస్సు (క్రెడిట్) కోసం ఏపీ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండానే ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు (క్రెడిట్ చోరీ) ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదిక 'X' లో వీడియోతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేసిన జగన్… "2019 ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు హడావిడిగా శంకుస్థాపన రాయి వేయడం తప్ప టీడీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు" అని మండిపడ్డారు. ఏ కాంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయడమే చంద్రబాబు మార్కు రాజకీయం అని విమర్శించారు.
ys jagan criticizes govt over dsc paper leakరూ.1,200 కోట్ల ఖర్చు, అనుమతులన్నీ మా హయాంలోనే: దస్త్రాల వారీగా జగన్ లెక్కలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో తమ ప్రభుత్వమే అసలైన పునాది వేసిందని జగన్ స్పష్టం చేశారు. జూన్ 2020లో జీఎంఆర్ (GMR) సంస్థతో కాన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి ల్యాండ్ అక్విజిషన్, ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీలు, కేంద్ర ప్రభుత్వ ఎన్‌వోసీలు (NOCs), విద్యుత్, నీటి వసతి మరియు ఫైనాన్షియల్ క్లోజర్ వరకు అన్ని కీలక ఘట్టాలు తమ పాలనలోనే పూర్తయ్యాయని వివరించారు. భూసేకరణ, పునాది మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేసిందని, కోవిడ్ సంక్షోభంలోనూ పనులు వేగవంతం చేసి 2026 నాటికి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని తామే అప్పట్లో ప్రకటించామని గుర్తుచేశారు. "ఏమీ చేయకుండా కేవలం ప్రచారం చేసుకోవడం మానుకోవాలని, 80 ఏళ్లు వస్తున్న వయసులోనైనా నిజాయితీగా వ్యవహరించాలి" అని చంద్రబాబుకు హితవు పలికారు.

