Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్లమలలో పులుల పరిరక్షణకు పవన్ కల్యాణ్ బిగ్ ప్లాన్!

నల్లమలలో పులుల పరిరక్షణకు పవన్ కల్యాణ్ బిగ్ ప్లాన్!

వార్త 1 week ago

International Tiger Day: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటనలు చేశారు.

నల్లమల అడవుల్లో పులుల ఉనికిని శాశ్వతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పులుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తూర్పు కనుమలలో పులుల పునరుజ్జీవనానికి చారిత్రక అడుగులు వేస్తున్నామని తెలిపారు.

Read Also : Tammineni Sitaram : పోలీసుల విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం

 Pawan Kalyan’s big plan for tiger conservation in Nallamala!

International Tiger Day: మహారాష్ట్ర, ఎంపీల నుంచి 4 ఆడ పులుల తరలింపు

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. పులులను కాపాడుకోవడం అంటే అడవులను, జలవనరులను, భావితరాల వారసత్వాన్ని కాపాడుకోవడమేనని వ్యాఖ్యానించారు. తూర్పు కనుమలలో జన్యు వైవిధ్యాన్ని పెంచేందుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాలుగు ఆడ పులులను ఏపీకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా నిఘా పెరగడంతో పాటు సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌టీఆర్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో 68 పులులు, 11 పులి పిల్లలు ఉన్నాయని తెలిపారు.

శాస్త్రీయ పద్ధతులు.. కొత్త జంతువుల పునఃప్రవేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లతో నిఘాను తీవ్రతరం చేశామని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో పాటు నల్లమల అడవుల్లో గౌర్ (అడవి దున్న) జంతువుల పునఃప్రవేశం, పాపికొండల అటవీ ప్రాంతంలో ఆడ పులుల ప్రవేశం వంటి సత్వర కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

తిరుమలలో గురుపౌర్ణమి రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు చేసిన టీటీడీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha