Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు బ్రేక్? విష్ణుకుమార్ రాజు సంచలన డిమాండ్!

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు బ్రేక్? విష్ణుకుమార్ రాజు సంచలన డిమాండ్!

వార్త 1 week ago

Bhogapuram Airport : రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.

పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్యులు అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం విలాసవంతమైన ప్రాజెక్టుల కంటే ప్రజా అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు భోగాపురం విమానాశ్రయ పనులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భోగాపురం పనులు ఆపండి.. విశాఖ ఎయిర్‌పోర్టును కొనసాగించండి

దేశంలో ఇంధన పరిస్థితులు చక్కబడే వరకు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. విమానాశ్రయం కంటే ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, విశాఖపట్నం ఎయిర్‌పోర్టును యథాతథంగా కొనసాగించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

 Bhogapuram Airport

ఎలక్ట్రిక్ బస్సులు, వందేభారత్ రైళ్లే పరిష్కారం

డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని, అలాగే విశాఖ నుండి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, చెన్నై నగరాలకు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా మెరుగుపడితే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి, ఇంధన భారం తగ్గుతుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేసీఆర్‌పై కవిత సంచలన ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha