Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం పర్యటనలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్

భోగాపురం పర్యటనలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్

వార్త 1 week ago

PM Bhogapuram Schedule: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న రానున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలో మొత్తం 2 గంటల 25 నిమిషాల పాటు గడపనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

PM Bhogapuram Schedule: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ (ఆగస్టు 1)

  • ఉదయం 10:45 గంటలకు: దిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • ఉదయం 10:45 - 10:50: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలుకుతారు.
  • ఉదయం 10:50 - 10:55: ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుండి ప్రత్యేక వాహనంలో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.
  • ఉదయం 10:55 - 10:58: టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులు ప్రదర్శించే సాంప్రదాయ కూచిపూడి నృత్యంతో ప్రధానికి స్వాగతం లభిస్తుంది.
  • ఉదయం 11:00 - 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ మరియు రన్‌వే నిర్మాణ పనులను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు.
  • ఉదయం 11:17 - 11:25: టెర్మినల్ భవనం నుండి ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు బయలుదేరుతారు.
  • ఉదయం 11:30 - మధ్యాహ్నం 12:55: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలకాల ఆవిష్కరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం మరియు భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
  • మధ్యాహ్నం 1:05 - 1:10: భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

28, 29న నెల్లూరులో ఏపీఎస్‌సీపీసీఆర్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha