Bhogapuram Airport: జూలై మొదటి వారంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారని మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు.అక్కడ చిన్న చిన్న అప్రోచ్ రోడ్లు మించి అన్ని పనులు పూర్తిచేసుకుని ప్రారంభం కి సిద్ధం చేస్తామన్నారు.
మహానాడు లాంటి పెద్ద పండగలో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మహానాడు వేదికగా స్త్రీ శక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33 % రిజర్వేషన్లు, వుమెన్ సేఫ్టీ, వుమెన్ ఎంపవర్‌మెంట్ అన్నీ టీడీపీలో మహిళా సాధికారితకు నిదర్శనం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి గరివిడి ఫ్యాక్టరీని ఎవరు టేకోవర్ చేసినా… ఫ్యాక్టరీ కొనసాగించేందుకు కృషి చేస్తున్నాం. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోంది. జోన్ కోసం అవిశ్రాంత కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జోన్ ఇచ్చి ఏపీ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి ధన్యవాదాలు.
జూన్ 30 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ రోడ్స్, రైతుల సమస్యలు పూర్తి చేస్తాం. జిల్లాలో నిరుద్యోగిత తగ్గించాలంటే పరిశ్రమలు జిల్లాకు రావాలి. భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించాలి.. వారికి భరోసా కల్పించడంతో పాటు నష్టపోకుండా పరిహారం ఇవ్వాలి. ఈ రోజు హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందడానికి రైతులను ఒప్పించి భూసేకరణ చేయడమే ఎంతో కీలకం. రైతులకు కష్టం లేకుండా భూసేకరణ చేసేలానే ముందుకు వెళతాం. వితంతు పెన్షన్లు ముందుగా ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అని స్పష్టం చేసిన మంత్రి. 19 ఎంఎస్ఎంఈ పార్కుల్లో 800 కంపెనీల పనులు ప్రారంభమయ్యాయి. మరో 81 పార్కుల పనులు మరో 3 నెలల్లో పూర్తవుతాయి. మొన్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో మరో 38 పనుల శంకుస్థాపన కూడా సీఎం గారు చేశారు.
Bhogapuram Airport:జూలైలో అందుబాటులోకి భోగాపురం విమానాశ్రయం
జిల్లా కేంద్రం విజయనగరంలోనూ ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించాము. పెద్ద పరిశ్రమల్లో కోటి రూపాయల పెట్టుబడి పెడితే ఒక్కరికే ఉద్యోగం వస్తుంది. ఎంఎస్ఎంఈలో అదే కోటికి 10 మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంస్ఎంఈ పార్కుల్లో ఇండస్డ్రీలు వచ్చేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి.. ప్రతిపక్షం 200 కేసులు వేసినా విజయవంతంగా 16 వేలమందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. గ్రూప్ 1 పేపర్ల వాల్యూషన్ ప్రైవేటు రిసార్ట్స్‌లో చేసింది వైసీపీ ప్రభుత్వమే. ఇది ఎంత వరకు సమంజసమో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలి. ఐసీడీఎస్ అధికారుల చర్యలపై నా పాత్ర లేదు. తప్పుచేసిన వారి విషయంలో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఎస్సై కల చెదిరి.. నకిలీ ఏసీబీ అధికారిగా మారి: 250 మంది అధికారులను ముంచిన యువకుడు

