Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారుగా.. అమరావతిలో జయశంకర్  విగ్రహం పెట్టరా?

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారుగా.. అమరావతిలో జయశంకర్ విగ్రహం పెట్టరా?

వార్త 2 months ago

Rohit Vakrala: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ 'తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్' కన్వీనర్ రోహిత్ వక్రాల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

రెండు రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని మరింత పెంపొందించే ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేసినట్లు సదరు ఫోరమ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read Also:Chandrababu Naidu: గత ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ కార్యకర్త ఈ. నిరంజన్ ఫైర్

అమరావతిలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టండి

రోహిత్ వక్రాల రాసిన ఈ లేఖలో ఇటీవల హైదరాబాద్‌లోని మైత్రివనం (అమీర్‌పేట్) పరిసరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడి ప్రభుత్వం, ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులను ఎల్లప్పుడూ గౌరవిస్తున్నారని లేఖలో వివరించారు. హైదరాబాద్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, రవీంద్రభారతిలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాజాగా అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు.

Rohit Vakrala:ఏపీ రాజధానిలో తెలంగాణ సిద్ధాంతకర్త విగ్రహం?

అదే స్ఫూర్తిని మరియు పరస్పర గౌరవాన్ని చాటుకునేలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం చొరవ చూపాలని చంద్రబాబును కోరారు. అందుకోసం రాజధాని ప్రాంతంలో తగిన స్థలాన్ని కేటాయించాలని, ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత సత్సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన కొద్ది రోజులకే అమరావతిలో జయశంకర్ విగ్రహ ఏర్పాటు డిమాండ్ తెరపైకి రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పెట్రోల్, గ్యాస్ భారం.. కేంద్ర నిరంకుశ విధానాలపై జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha