Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురంలో అమానుషం..నష్టపరిహారం అడిగితే జేసీబీ బకెట్‌లో ఎక్కించి నెట్టేస్తారా?

భోగాపురంలో అమానుషం..నష్టపరిహారం అడిగితే జేసీబీ బకెట్‌లో ఎక్కించి నెట్టేస్తారా?

వార్త 1 week ago

Bhogapuram Airport Road Tension: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్డు (Approach Road) పనుల సందర్భంగా తమ భూములకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై అధికారులు, సిబ్బంది దౌర్జన్యానికి దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన అప్రోచ్ రోడ్డు పనులను ప్రారంభించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తుతో శనివారం క్షేత్రస్థాయికి చేరుకున్నారు. అయితే, గత రెండు రోజులుగా స్థానిక రైతులు మరియు గ్రామస్తులు “మాకు రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి” అని ససేమిరా అంటూ పనులను అడ్డుకుంటున్నారు.

జేసీబీ బకెట్‌లో ఎక్కించి అమానుషం!

రైతులు పనులను ప్రతిఘటిస్తున్న క్రమంలో అధికారుల ఆదేశాలతో సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. భూమి కోసం నిరసన తెలుపుతున్న బైరెడ్డి అప్పల నరసయ్య అనే వృద్ధుడిని, అతని కోడలు సత్తయ్యమ్మను బలవంతంగా జేసీబీ (JCB) బకెట్‌లో ఎక్కించి, దౌర్జన్యంగా బయటకు నెట్టేసే ప్రయత్నం చేశారు. అధికారుల ఒత్తిడితో జేసీబీ ఆపరేటర్ బకెట్‌ను పైకి లేపి వారిని పక్కకు నెట్టేయబోగా, బకెట్‌లో ఉన్న ఇరువురు ప్రాణభయంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒకవేళ వారు అక్కడి నుంచి కిందకు దూకి ఉంటే పరిస్థితి మరేదో విధంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు భయాందోళన వ్యక్తం చేశారు.

Bhogapuram Airport Road Tension: తిరగబడ్డ రైతులు.. అధికారుల వెనకడుగు

అధికారుల దౌర్జన్యాన్ని గమనించిన తోటి రైతులు, గ్రామస్తులు ఒక్కసారిగా జేసీబీ వైపు దూసుకువచ్చి తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ప్రజా నిరసన వెల్లువెత్తడంతో దిగివచ్చిన అధికారులు, బకెట్‌లో ఉన్న వృద్ధుడిని, మహిళను సురక్షితంగా కిందకు దించి పక్కకు చేర్చారు.

“మాకు చెందాల్సిన భూములకు నష్టపరిహారం అందజేయకపోగా, ఇలా మా జీవితాలను కూడా నాశనం చేస్తారా? మమ్మల్ని బతకనివ్వరా?” అని బాధితులు కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టడమే కాకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గ్రామస్తులు యాకరువు పెట్టారు.

 Protesting farmers arguing with Tahsildar Haribabu and Police CI Durga Prasad over land compensation at Bhogapuram

రంగంలో భారీ బందోబస్తు.. అధికారులపై విమర్శలు

ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఘటనాస్థలంలో సీఐ దుర్గా ప్రసాద్, ఎస్సై పాపారావు, తహసీల్దార్ హరిబాబు, ఆర్యా కిషోర్ తదితర పోలీస్ మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండి పనులను పర్యవేక్షించారు. అధికారుల సమక్షంలోనే ఇంతటి అమానవీయ ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులే దౌర్జన్యానికి దిగడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని గ్రామస్తులు వేదన చెందుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భోగాపురం విమానాశ్రయం.. 99.3% పనులు పూర్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha