Dailyhunt
Bhopal: భర్తను ప్రియురాలికి 1.5 కోట్లకు అమ్మేసిన భార్య

Bhopal: భర్తను ప్రియురాలికి 1.5 కోట్లకు అమ్మేసిన భార్య

వార్త 1 month ago

Bhopal: తెలుగు సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను కోటి రూపాయలకు అతని ప్రియురాలికి అమ్మేసే కథ అందరు చూసి ఉంటారు..

ఇప్పుడు అదే తరహా ఘటన నిజ జీవితంలో చోటు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భార్య స్వయంగా తన 23 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి, తన భర్తను రూ.1.5 కోట్లకు అతని ప్రియురాలికి అప్పగించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

FreeTrade Agreements: 38 దేశాలతో కీలక వాణిజ్య ఒప్పందాలు

23 ఏండ్ల వారి వివాహ బంధానికి తెర

వివరాల్లోకి వెళితే, 23 ఏళ్ల క్రితం ఈ భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ముగ్గురినీ కౌన్సెలింగ్‌కు పిలిచింది.

అయితే తాను ప్రియురాలితోనే ఉంటానని భర్త స్పష్టం చేశాడు. దీంతో తన భర్తను ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్‌ చేసింది. దీనికి ప్రియురాలు సై అనడంతో 23 ఏండ్ల వారి వివాహ బంధానికి తెరపడింది. ఆ భార్యకు ఒక డూప్లెక్స్‌ ఇంటితో పాటు 27 లక్షల నగదును ప్రియురాలు చెల్లించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో అందులోకి మారిపోయేందుకు సిద్ధపడుతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Saketh: అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha