Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూ రీసర్వే ప్రక్రియపై రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి ఆదేశాలు

భూ రీసర్వే ప్రక్రియపై రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి ఆదేశాలు

వార్త 3 weeks ago

Medak Land Survey: భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీ.ఎస్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.

మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో సమావేశ మందిరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్ సంబంధిత ఆర్డీవోలు, తాహాసిల్దార్లు, లైసెన్స్ సర్వేయర్లతో జిల్లాలో భూ సర్వే అమలు తీరు, భూభారతి, సాదా బైనామా , రెవిన్యూ సదస్సులు నిర్వహణ సంబంధిత అంశాలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ సుదీర్ఘంగా చర్చించారు.

Read Also: DSP Bheem Reddy: రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన డీఎస్పీ భీంరెడ్డి..!

 Directives from the State Revenue Secretary regarding the land re-survey process.

Medak Land Survey: మెదక్ జిల్లాలో సర్వే పురోగతి

ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 24 గ్రామాలు రీ సర్వే ఎంపికకగా 7 గ్రామాల్లో పూర్తి రీ సర్వే పూర్తి అయిందని,18 గ్రామ సభలు నిర్వహించారని తెలిపారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లా సమర్థవంతంగా భూ సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. భూముల రీ సర్వే ప్రక్రియలో తాసిల్దార్లు ఆర్డీవోలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న అంశాలను భూ పరిపాలన నిబ నిబంధనలకు లోబడి సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ భూ సర్వేలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో పటిష్ట చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేటప్పుడు దారిద్య రేఖకు దిగువన ఉన్న నిజమైన భూ లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా ఈ రీ సర్వే జరగాలని స్పష్టం చేశారు.

కొత్త ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్ల కేటాయింపు

భూముల రీసర్వే ప్రక్రియకు సంబంధించి ఎక్విప్మెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (LPM) భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేందుకు వీలుగా కొత్తగా ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ గతంలో రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ, సరిహద్దు వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పటిష్ట ప్రణాళికతో ఈ సర్వే ప్రక్రియ పూర్తి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు, మ్యుటేషన్ ప్రక్రియలు పారదర్శకంగా, జాప్యం లేకుండా అందించాలని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 134 గ్రామాలు సర్వే ప్రక్రియ పూర్తి అయినవని తెలిపారు. భూ సర్వే నిర్వహించేటప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేసేటప్పుడు డెడ్ లైన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రామసభల తేదీలు వాయిదా వేయకూడదని స్పష్టం చేశారు. భూ సర్వేలో బౌండరీ ఫిక్సింగ్, ప్రభుత్వ భూములు గ్రామకంఠం సంబంధిత విషయాలలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. గతంలో 1946 సంవత్సరంలో సర్వే నిర్వహించడం జరిగిందని అప్పటినుండి ఎలాంటి సర్వే జరగలేదని భూముల రి సర్వే ప్రక్రియ చేపట్టి నిజమైన భూలబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. లైసెన్స్ సర్వేయర్స్ కు గౌరవ వేతనం అందించే విషయంలో సుముఖత వ్యక్తం చేస్తూ వారం వారం చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సర్వేయర్ ఏ, డి కిషన్ ను ఆదేశించారు.

సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన

అనంతరం సాదాబైనామ, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై మండలాల వారీగా రివ్యూ నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని పరిష్కరించాలన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ మరియు భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ..ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరగాలని గతంలో నిర్వహించే సర్వే సాధారణ ఎక్విప్మెంట్తో జరిగిందని ఇది పూర్తిగా డిజిటల్ సర్వేనని సమర్థతతో పూర్తిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రీ-సర్వే కార్యక్రమం నిర్దేశిత గడువులోగా, అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి కావడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, కమిషనర్ గారి ఆదేశాల మేరకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha