Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన డీఎస్పీ భీంరెడ్డి..!

రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన డీఎస్పీ భీంరెడ్డి..!

వార్త 3 weeks ago

DSP Bheem Reddy: ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఏసీబీ సోదాలు పెరుగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. తాజాగా పోలీస్ శాఖకు చెందిన భారీ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ పట్టుకుంది.

డీఎస్పీ స్థాయి అధికారి అక్రమంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు. అతని అక్రమాస్తులు లెక్క కట్టేందుకు అధికారులకు ఒక రోజు సరిపోలేదు. గురు, శుక్రవారం సోదాలు చేసి అవినీతి సొమ్మును బయట పెట్టాయి. పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడగట్టాడు.

Read Also: Telangana Rythu Bharosa: కొత్త పాస్ బుక్ రైతులకు అలర్ట్.. రైతు భరోసాకు 2 రోజులే ఛాన్స్!

 DSP Bheem Reddy

DSP Bheem Reddy: భారీగా ఆస్తులు కొనుగోలు

విషయం తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖ భీం రెడ్డికి సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో గురువారం ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేసింది. సోదాల్లో భారీ ఆస్తులు బయటపడ్డాయి. భీం రెడ్డి 1989లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరాడు. ఆయన 1995లో ఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఎస్సై అయినప్పటి నుంచి భీం రెడ్డీ లంచాలకు రుచిమరిగారని చెబుతున్నారు. ఇక 2010లో సీఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్రమ సంపాదన మరింత పెరిగింది. తన వద్దకు వచ్చే ఎవరిని కూడా వదలకుండా భీంరెడ్డి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తన సర్వీస్ లో హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోనే విధులు నిర్వహించిన ఆయన భారీగా వెనకేసుకున్నారు. విధులు నిర్వహించిన ప్రతి ప్రాంతాలంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట వ్యాపారులను బెదిరించి ప్లాట్లను తమ బంధువులు, స్నేహితుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన పేరుపై ఒక్క చర ఆస్తి కూడా లేదు. అన్నీ బినామీల పేరు మీదే ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Epaper: epaper.vaartha.com

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోంది: హరీశ్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha