Medak District Land Survey: భూభారతితో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం నాడు మండల పరిధిలోని జుక్కల్ గ్రామంలో నిర్వహించిన భూభారతి- భూముల రీ సర్వే గ్రామసభ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ లోపాల కారణంగా తెలంగాణలో అనేక మంది పేద రైతులు తమ భూముల హక్కులను కోల్పోయారని, భూ కబ్జాలకు ఆ వ్యవస్థ కారణమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు నాయకులు పేద రైతుల భూములను కబ్జా చేశారని విమర్శించారు. ఎంతో మంది నిజమైన భూ యజమానులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Read Also : Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 లోన్ ఆగిపోవడానికి కారణం ఇదే
Solution to land issues through ‘Bhu-Bharathi’: MLA Sanjeeva Reddy
Medak District Land Survey: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నిర్ణయం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో 'భూ భారతి- భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఈ రీ సర్వే ద్వారా ప్రతి భూమికి స్పష్టమైన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయని, సరిహద్దు వివాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
జుక్కల్ గ్రామ రైతులు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించి, తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలను సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. భూ వివాదాలు లేని గ్రామంగా జుక్కల్ నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ నారాయణ, గ్రామ సర్పంచ్ ఏసమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, నాయకులు సురేందర్ రెడ్డి, సుభాష్ గౌడ్, సురేష్ గౌడ్ రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

