Dailyhunt
భూదాన భూముల్లో వెలుగునీడలు జంజాటం!

భూదాన భూముల్లో వెలుగునీడలు జంజాటం!

వార్త 5 days ago

The land of Bhudan : చట్టాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు పేదల సమస్యల పట్ల పనిచేసేటప్పుడు చూపించే ఉదాసీన నిర్లక్ష్యపు వైఖరికి భిన్నంగా న్యాయం పేర ఇవే వ్యవస్థలు పేదల మీద ఎంత వికృతంగా విరుచుకుపడి చట్టాన్ని అమలుచేస్తున్నామని చేసే ప్రకటనలు ఎంత జుగుప్సను, వ్యవస్థలపట్ల అసహ్యాన్ని కలిగిస్తాయో.

ఏదో యుద్ధంలో బాంబులు పడితే చెల్లాచెదురై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూస్తే ఎంతటివారి హృదయాలనైనా కరిగిస్తుంది. గత నెల ఫిబ్రవరి 24వ తారీఖున ఉన్నపళంగా ఏదో యుద్ధానికి వచ్చినట్టు వేల మంది పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చి ఉదయం 6గంటలకే సుమారుగా 50బుల్డోజర్ల ద్వారా గంటల్లో ఇండ్లను నేలమట్టం చేసి ఈ ప్రభుత్వం ఘనకార్యం చేసి నట్టు చెప్పుకుంటున్నది. అధికారులు వారేదో కబ్జాదారుల నుండి భూములను కాపాడినట్టు వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు. గ్రామీణ పేదల సంఘం గత నాలుగు ఐదు దశాబ్దాలుగా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదలకు ఇప్పించడానికి, గూడు లేని పేదలకు నివాసాలు ఏర్పాటు చేసుకోడానికి భూములి వ్వాలని వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తూ పేద ప్రజలకు భూమి, నివాస స్థలాలు ఇప్పించడానికి కృషిచేస్తున్నది.

Read Also: Sun intensity :చండ్ర నిప్పులు!

 the land of Bhudan:

the land of Bhudan : నిర్లక్ష్యంగా వ్యవహరించడం

ఈ క్రమంలో ఖమ్మం పట్టణం కేంద్రానికి అనుకుని ఉన్న వెలుగుమట్ల ప్రాంతంలో 147, 148, 149 సర్వే నెంబర్ల గల భూమి భూదానోద్యమకర్త వినోబా భావే పిలుపుతో ఒకప్పటి భూస్వాములు ఇచ్చినటువంటి భూదాన భూములు ఉన్నాయని వాటిలో పట్టణంలో వివిధ రకాల పనులు చేస్తూ అద్దె ఇండ్లలో పనిచేస్తున్న పేదలకు ఇవ్వండని ఈ సంఘం ఆధ్వర్యంలో 2014 జనవరిలో దరఖాస్తులు పెట్టు కుంటే భూదాన్ బోర్డు వారు ప్రొసీడింగ్స్ ఇచ్చి లేఔట్ ఇవ్వడమైనది. ఆ ప్రొసీడింగ్స్ అమలులోకి తెచ్చి అక్కడ నివాసం ఉండటానికి భూదాన్ బోర్డు నుండి పత్రాలు పొం దిన పేదలందరికీ నివాస హక్కులు ఇవ్వాలని అధికారులను ఎన్ని సార్లు వేడుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుమారుగా 400 కుటుంబాలు 2018 లో మొదటగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అది క్రమంగా నేడు 1000కుటుంబాల నివాసాల వరకు వెళ్లింది. ఈ పేదలు చాలాసార్లు కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పింది కానీ స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో ఆ పేద ప్రజలు అక్కడే నివాసం ఉంటూ పొట్టకూటికోసం పట్టణంలో చుట్టూ ప్రాంతాలలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో ఆ ప్రజలు తమకు కనీస సౌకర్యాలు కల్పించమని, ఇండ్లు-మంజూరు చేయమని పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

నిరక్ష్యపు వైఖరికి అద్దం

గత ప్రభుత్వం కూడా ఒకసారి వీరిని వెళ్లగొట్టాలని చూసినప్పటికీ ఆ బాధితులు గట్టిగా నిలబడటంతో వెనక్కి తగ్గారని చెప్పారు. అంతేకానీ అక్కడి ఆ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన కనీసం మౌలి క సదుపాయాలైన మంచినీటిని, విద్యుత్తును అందించడా నికి కూడా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఎటువంటి చొరవ చూపకపోవడం పేద ప్రజల జీవితాల పట్ల పాలకులకు, అధికారులకు ఉండేటటువంటి నిరక్ష్యపు వైఖరికి అద్దం పడుతుంది. ఆ ప్రజలే వారు సొంతంగా నీళ్ళ ట్యాం కర్తో నీళ్లు తెచ్చుకోవడం, జనరేటర్ పెట్టుకుని లేదా సోలార్ దీపాలు పెట్టుకుని అక్కడ బతుకీడుస్తున్నారు. ఐతే ఇక్కడ నివాసంఉంటున్న ప్రజలను ఇక్కడ ఉండే అధికా రం లేదంటూ వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలు ప్రతిసారి ఎన్నికల్లో వీరి ఓట్లను వేయించుకుని అధికారం లోకి వచ్చినవే. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గుడిసెలు కూలగొట్టాక మేము మీకు అండగా ఉంటామని ప్రకటిస్తున్న ప్రస్తుత ప్రతిపక్షం రెండు కూడా ఈ వెలుగు మట్ల ప్రజల దగ్గరికి వచ్చి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు అడుక్కున్నపుడు వీరు అనధికారికంగా ఉంటున్నారనే విషయం ఈ పాలకులకు లేదా? సరిగ్గా కలెక్టర్ కార్యా లయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రజలు నిత్యం వందల సార్లు వారికి నీళ్లు, కరెంట్ ఇవ్వమని అప్లికేషన్లు పెట్టుకుని, ధర్నాలు చేసినప్పుడు ఈ ప్రజలు ఇక్కడ ఎట్లా నివాసం ఉంటున్నారు. వారు ఎవరు అని వారితో మాట్లా డాల్సిన అవసరం, బాధ్యత ఈ అధికారులకు లేదా?

ఎవరికి హక్కే లేదని అబద్ధాలు

నిజం గానే ఈ ప్రజలు అక్రమంగా నివాసం ఉంటున్నారనిభావిస్తే గత ఎనిమిది సంవత్సరాలుగా అధికారులు ఈ పేద ప్రజల తో మాట్లాడి ఇక్కడ నుండి మర్యాదగా వారిని తరలించడా నికి ప్రయత్నమే చేయలేదు ఎందుకు? అత్యంత నిర్దాక్షి ణ్యంగా, అమానవీయంగా ఇళ్ళు కూలకొట్టించిన ప్రభుత్వం అధికారులతో అసలు అక్కడ ఉండటానికి ఎవరికి హక్కే లేదని అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. అధికారులు భుకాయి స్తున్నారు కదా! మరి అక్కడ అప్లికేషన్లు పెట్టుకున్న 120మంది బాధితుల్లో 60మందికి ఇంటి నెంబర్లు ఎట్లా కేటాయించారు. మిగతా వారి ఇంటి నెంబర్లు బ్లాకులో ఎందుకు ఉంచారు.ఈ సంఘటన జరిగిన వెంటనే కొంత మంది బాధితుల ఫోన్లకు ఇంటి పన్ను కట్టమని ఫోన్లకు సందేశాలు వచ్చాయని చెపుతున్నారు. అంటే అక్కడ నివాసం ఉంటున్న పేదలునివాసం ఉండటానికి వారికి హక్కు ఉన్నదన్నట్టే కదా. ప్రజలకు హక్కులేకనా లేదా ప్రభుత్వం కావల్సుకుని వారికి గల హక్కును నిరాకరిస్తూ బలవంతం గా వారిని ఎల్లగొట్టేకుట్ర చేసిందని అర్థమవుతుంది. నిజం గానే ప్రభుత్వం ఆ భూమిని రక్షించడానికి లేదా ఇంకేదన్నా ప్రజాప్రయోజనం కోసం ఉపయోగిద్దాం అనుకుంటే ఆ ప్రజ లతో మాట్లాడి -నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఇటువంటి చర్యకు దిగితే బాగుండేది కదా. అయినా వారిని అట్లా యెల్లగొట్టడానికి వారేమీ దురాక్రమణదారులు కూడా కాదు కదా. కనీసం ఇంట్లో ఉన్న పప్పులు, ఉప్పులు ఏవీ తీసుకునే వీలు లేకుండా తెల్లవారి తెల్లవారే ఆ వెలుగుమట్ల ప్రజల జీవితాల్లో నాలుగు గంటల్లో చీకట్లు నింపిన ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వం ఎట్లా సమర్థించుకుంది.

 the land of Bhudan:

భూ కబ్జాదారులనుండి రక్షించడం

నిజానికి 1951లో వినోబాభావే ప్రారంభించిన భూదాన ఉద్యమంలో భాగంగా ఇచ్చిన భూములన్నీ కూడా భూమిలేని పేదలకు భూమి ఇచ్చి సమాజంలో సామాజిక సమానత్వాన్ని సాధిం చాలనే ప్రధాన ఉద్దేశ్యంతో జరిగిన ఉద్యమం. భూమి లేని పేదలు వ్యవసాయం చేసుకోడానికి, గూడు లేని వారికి నివాసం కల్పించడానికి అనే లక్ష్యంతో ఈ భూదాన ఉద్య మాల్లో భూములు సేకరించడం జరిగింది. ఈ భూములకు ప్రభుత్వం ఒక ట్రస్టీలాగ ఉండవలసిందే కానీ ఈ భూము లపై ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవు. దానికి ఉన్న అధికారమల్లా ఈ భూములను దురాక్రమణల నుండి భూ కబ్జాదారులనుండి రక్షించడం మాత్రమే. ఈ భూముల నుఎట్టి పరిస్థితులలో పేదల కోసం ప్రజాప్రయోజలకోసం మాత్రమే కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి అటువం టప్పుడు ఈఖమ్మం పట్టణం కేంద్రంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న ప్రజలు వందకు వంద శాతం అర్హులే కదా. ఈసంఘటన జరిగిన తరువాత అర్హులందరికీ ఇండ్ల స్థలా లు కేటాయించి ఇండ్లు కట్టిస్తామని ఆప్రాంత మంత్రి పత్రికల ముందు టీవీల ముందుప్రకటిస్తున్నారు. అసలు నిజం గా ప్రభుత్వానికి ఆ ఉద్దేశమేఉంటే అక్కడే సర్వేచేసి అర్హులైన వారిని ఉంచి మిగతావారిని చట్టప్రకారం వెళ్లగొట్టే అవకాశం లేకపోయిందా. కోట్ల విలువైన భూమిని కాపాడా మని ఆ జిల్లా అధికారులు ప్రకటిస్తున్నారు. అసలు ఆభూమి పేదప్రజల ప్రయోజనాలకోసం ఇచ్చి నటువంటి దాన్నివ్యాపారకోణంలో మార్చి మాట్లాడు తుంటేనే ఇందులో ఏదో కుట్రపూరితంగా చేసిన చర్యగా కనపడుతుంది.

-దిలీప్. వి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్‌కు భక్తుడి భారీ విరాళం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha