Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చండ్ర నిప్పులు!

చండ్ర నిప్పులు!

వార్త 3 weeks ago

Sun intensity : ఈ సారి ముందస్తు వానల కబురు మనసును తేలిక చేస్తుంటే, అదే సమయానికి నడి నెత్తి మీద ఎండవేడిమి వడదెబ్బ రూపంలో మొట్టికాయలు వేయడం కాకతాళీ యమే కావచ్చు.

తెలుగురాష్ట్రాల ప్రజలు ఎండ, వానలతో విచిత్ర అనుభవాలు ఎదుర్కొంటున్నారు. ఒక తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఎండ తీవ్రత తట్టుకోలేని విధంగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఎండ చండ్ర నిప్పులు కురుస్తోంది. ఎండలు నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. పగలు కానీ రాత్రి కానీ పిల్లలు ఇళ్ళల్లో మగ్గిపోతున్నారు . భద్రాద్రి జిల్లాలో అకాల వర్షాలతో రైతాంగం విస్తుపోతోంది. శనివారం సాయంత్రం వడగండ్ల వాన, ఈదురు గాలులతో రోడ్ల పక్కన చెట్లన్నీ నేలవాలాయి. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో ఎడతెరిపిలేని వర్షంతో గోదావరి జిల్లా వాసులు తడిసి ముద్దయ్యారు. పిడుగులు సంగతి మామూలే!మరో నాలుగు రోజులు ఇదే మాదిరి వాతా వరణం చూస్తామని హెచ్చరికలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మెండోరాలో గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్నరీతిలో 46 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటుఏటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసుకునే పల్నాడుజిల్లా రెంటచింతల 45 డిగ్రీల నమోదుతో ఉష్ణో గ్రతలో కాస్త వెనకబడింది.

Read Also : Rain Updates: ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్ష సూచన

 Sun intensity

Sun intensity : బయటికి వెళ్తే ఇబ్బందులు తప్పవు

ప్రతి రోజు సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, కనుక మధ్యాహ్నం 12గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటకి కదల రాదన్న ఆంక్షలున్నాయి. శనివారం తెలంగాణ రాష్ట్రంలో 12 జిల్లాలలో సూరీడు నిప్పులు కక్కుతూ జనాన్ని ఉక్కపోతకు గురిచేశాడు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు గురై నలుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు రైతులు. వచ్చే రెండు రోజులు పాటు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తప్పవని – హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఏదైనా కాసిం త ఉపశమనం పొందాలన్నా ఆరవ తేదీ తర్వాతనే. ఆ తర్వాత మాత్రమే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్ర తలకు తగ్గుతుందని సూచన. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్తే ఇబ్బందులు తప్పవని అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది. భవన నిర్మాణా కార్మికులు, అసంఘటిత కార్మికులు, ఉపాధి కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఎండల్లో పని చేస్తూ ఆపసోపాలు పడుతున్నారు.మొన్నో రోజు హైద రాబాద్లో వాషింగ్ మిషన్సేలిన సంఘటన, నిన్న తూర్పు ఢిల్లీలో ఎసి యూనిట్వేలి ఒక నివాస భవనంలో 9మంది చావుకు కారణ మైనదుర్ఘట. కారణం బయటి వాతావరణం లో అత్యధిక వేడిమివల్లనే జరిగింది. ఈ స్థాయి వేడిమికి జంతుజాలానికి, ప్రత్యేకించి పక్షులకు ప్రమాదమే. ఇప్పటికేచాలా పక్షులు నేల రాలిన సంఘటనలు నమోద య్యాయి.

ముందు జాగ్ర త్తలు అవసరం

కొన్ని తూర్పు తీరప్రాంతాల్లో సాధారణంగా కన్నా ఎక్కువరోజులు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎల్నినో ఎఫెక్టే కారణం. కాగా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరగడమనేది పట్టణీకరణ వల్లే కావచ్చు. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు
దానికి తగ్గ ఉపశమనాలు పాటించకపోతే అనారోగ్యంపాలవుతా మని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు హీట్ వేవ్ యాక్షన్లన్లను విడుదలచేసి వేడిమి ఉప శమన ద్రవాలు, మజ్జిగ, మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచింది. కానీ వడగాలులు ఎవరిని ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో చెప్పలేం కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే! వేసవిలో ఎండతీవ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటితే సమస్యలు పెరుగుతున్నాయన్నమాటే. ఎండల ధాటి 45 డిగ్రీల స్థాయికి చేరుకుంటే, ప్రమాద స్థాయిమరింతగా పెరుగుతుంది. ఎండవేడిమితో త్వరగా అలసట, నీరసం ఆవహించి, అతిసారం, వాంతులు తల తిరగడం వంటి అనారోగ్య లక్షణాలు వెంటాడతాయి. ఉష్ణో గ్రతలు 45డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు ఎక్కువ. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపా యానికి కూడా దారితీయవచ్చు. అందుకే ముందు జాగ్ర త్తలు అవసరం. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదయ్యాయి.

 Sun intensity

వర్షాలు ఉన్నా వేడిమి లో ఊరట ఉండబోదు

భారత వాతావరణ శాఖ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్ర తలు 40.5, 42.5 డిగ్రీలవరకు, తెలంగాణలో 41.5 నుంచి 43.5డిగ్రీల వరకు నమోదయ్యాయి. కానీ ఈసారి ఆ అంకెలు దాటిపోయి ప్రమాదకర పరిస్థితిలో పడ్డాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45, 47 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాల రాక గురించి వాతా వరణశాఖ ఓ మంచి వార్త చెప్పింది. సాధారణంగా వచ్చే సమయం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్ను పలకరిస్తాయని పేర్కొంది. ఈనెల 14,15 తేదీ లలో నైరుతి రుతుపవనాలు అండమాన్కి వస్తున్నాయి. ఈ సందర్భంగా పలుప్రాంతాల్లో సాధారణంగా అధిక స్థాయిలో వడగాలులు వీస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో అతిఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడిస్తోంది. గుజరాత్లోని సౌరాష్ట్ర, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్లోని దక్షిణ ప్రాంతాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సాసహా కోస్తా తీరరాష్ట్రాల్లో ఎక్కువ స్థాయిలో వడగాలులు వీస్తాయి. దేశంలో రాత్రిపూట సాధా రణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. మేనెలలో సాధారణ వర్షపాతంకంటే 110శాతం ఎక్కువగా ఉండచ్చునని అంచనా. వర్షాలు ఉన్నాయని చెప్పినా వేడిమి లో ఊరట ఉండబోదు. పైగా పగటి ఉష్ణోగ్రత ఎలా ఉన్నా సాయంత్రం ఉష్ణోగ్రత మాత్రం అధికంగానే ఉం టాయని ఐఎండి తెలియ చేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha