Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూకబ్జా ఆరోపణల కేసులో విచారణకు హాజరైన భూమన

భూకబ్జా ఆరోపణల కేసులో విచారణకు హాజరైన భూమన

వార్త 1 month ago

Bhumana Karunakar Reddy: భూకబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసులో వైఎస్సార్‌సీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు.

తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ విచారణకు ఆయన తన కుమారుడు అభినయ్ రెడ్డి మరియు న్యాయవాదితో కలిసి వచ్చారు.

కేసు నేపథ్యం మరియు ఫిర్యాదు వివరాలు

తిరుపతి రూరల్ మండలం, తానపల్లి గ్రామంలోని 7.91 ఎకరాల లేఅవుట్‌లోకి 2023 నవంబర్ 4న భూమన మరియు ఆయన అనుచరులు బలవంతంగా ప్రవేశించి, దశాబ్దాల నాటి మామిడి, టేకు, నేరేడు చెట్లను నరికివేశారని చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి చెందిన మామిడి తోటకు దారి వేసే ప్రయత్నంలో అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 12న తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ జరిగింది.

Bhumana Karunakar Reddy: రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్న భూమన ఆరోపణలు

ఈ కేసు నమోదు ప్రక్రియ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తొలుత ఎఫ్ఐఆర్‌లో ఫిర్యాదుదారుగా జిల్లా కలెక్టర్ పేరును నమోదు చేసి, ఆ తర్వాత అదే క్రైమ్ నంబర్‌పై ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారని, అధికారిక రికార్డులను తారుమారు చేశారని ఆయన మండిపడ్డారు.

భూమన ఆరోపణలను తోసిపుచ్చిన తిరుపతి ఎస్పీ

భూమన ఆరోపణలను తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పూర్తిగా తోసిపుచ్చారు. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం ఒకే ఎఫ్ఐఆర్ నమోదైందని స్పష్టం చేశారు. భూ కబ్జాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లేఖ రాయగా, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో కలెక్టర్ పేరు రావడం కేవలం డేటా ఎంట్రీ పొరపాటేనని, ఎడిట్ ఆప్షన్ ద్వారా దాన్ని సరిదిద్దామని వివరించారు.

Epaper: epaper.vaartha.com

వేంపల్లెలో పెళ్లి మోసం: 'సారీ' మెసేజ్‌తో ట్విస్ట్.. విచారణలో నివ్వెరపోయే నిజాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha