Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేంపల్లెలో పెళ్లి మోసం: 'సారీ' మెసేజ్‌తో ట్విస్ట్.. విచారణలో నివ్వెరపోయే నిజాలు!

వేంపల్లెలో పెళ్లి మోసం: 'సారీ' మెసేజ్‌తో ట్విస్ట్.. విచారణలో నివ్వెరపోయే నిజాలు!

వార్త 1 month ago

Vempalle Marriage Fraud Case : వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలంలో చోటుచేసుకున్న ఓ పెళ్లి మోసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయి, మరొక కొన్ని గంటల్లో ముహూర్తం ఉందనగా వధువు నుంచి వచ్చిన ఒక్క మెసేజ్ వరుడి కుటుంబ సభ్యులను తేరుకోలేని దెబ్బతీసింది.

వేంపల్లె మండలానికి చెందిన ప్రసాద్ అనే యువకుడికి పులివెందుల పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, ఇరువైపులా పెళ్లికి నిశ్చయించుకున్నారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో వివాహానికి ముహూర్తం ఖరారు చేయడంతో, వరుడి ఇంట షామియానాలు వేసి, విద్యుత్ కాంతులతో అలంకరించి ఊరందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి దుస్తుల కోసం రూ. 1.50 లక్షలతో పాటు వివిధ రూపాల్లో వరుడి కుటుంబంతో రూ. 10 లక్షల వరకు ఖర్చు చేయించారు.

Read Also: AP Organ Donation Bill: అవయవదాత కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం.. మంత్రి కీలక ప్రకటన

 Vempalle Marriage Fraud Case

Vempalle Marriage Fraud Case : ‘సారీ’ మెసేజ్ - షాకింగ్ ట్విస్ట్

పెళ్లికి బయలుదేరే సమయానికి వధువు రాకపోవడంతో వరుడు ఫోన్ చేశాడు. మొదట స్పందించని వధువు, ఆ తర్వాత ‘సారీ’ అని మెసేజ్ పంపింది. ఆందోళనతో మళ్లీ కాల్ చేయగా.. “నేను పెళ్లికి వస్తే మా అమ్మ ఉరివేసుకుంటానంటోంది” అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. బాధితుడు వెంటనే వేంపల్లె పోలీసులను ఆశ్రయించాడు. చివరి నిమిషంలో యువతి పెళ్లికి ముఖం చాటేయడంతో మోసపోయానని బాధితుడు గ్రహించాడు. బుధవారం రాత్రి నేరుగా వేంపల్లె పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన వేంపల్లె పోలీసులు తమదైన శైలిలో ఆరా తీశారు. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. ఆ యువతికి అప్పటికే రెండు వివాహాలు జరిగాయని తేలింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు నివ్వెరపోయాడు. అంతేకాదు, సదరు యువతి ప్రసాదు చిన్నాన్న కుమారుడి నుంచి కూడా దుస్తుల కొనుగోలు పేరుతో రూ. 40 వేల వరకు ఖర్చు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్‌తోనే ఆమె వరుడికి వలవేసి డబ్బులు లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha