Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూములను మేమే కాపాడాం - హరీశ్ రావు

భూములను మేమే కాపాడాం - హరీశ్ రావు

వార్త 3 weeks ago

Miyapur Land Issue : తెలంగాణలో మియాపూర్ భూముల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భూములు ప్రభుత్వానికి దక్కేలా గతంలో తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

భూముల పరిరక్షణ కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథను నియమించి న్యాయపరంగా పోరాటం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, వాటిపై హక్కులు కోల్పోకుండా న్యాయస్థానాల్లో వాదనలు వినిపించామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై విమర్శలు చేస్తూ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూముల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. మియాపూర్ భూముల పరిరక్షణకు తాము చేసిన ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

 The Supreme Court has taken up a hearing regarding allegations that CEC Gyanesh Kumar made unilateral decisions. It issued notices to the Election Commission seeking a response.

142 ఎకరాల మంచిరేవుల భూములపైనా ప్రస్తావన.. కాంగ్రెస్‌పై విమర్శలు

మియాపూర్ భూములతో పాటు హైదరాబాద్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతానికి చెందిన 142 ఎకరాల భూములను కూడా తామే కాపాడామని హరీశ్ రావు వెల్లడించారు. ఈ భూములపై సుమారు 40 నుంచి 50 ఏళ్ల పాటు న్యాయపోరాటం జరిగిందని వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో ఈ భూములకు సంబంధించిన కేసులో కోర్టులో ఓడిపోయిందని ఆరోపించారు. అనంతరం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించే ముందు గతంలో జరిగిన పరిణామాలను గుర్తించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. మియాపూర్, మంచిరేవుల భూముల అంశాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు వేదికగా మారుతున్నాయి. భూములపై గతంలో జరిగిన న్యాయపోరాటాలు, కోర్టు తీర్పులు, ప్రభుత్వాల పాత్రపై రాజకీయ చర్చ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha