Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

వార్త 3 weeks ago

Shadnagar Govt Hospital: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న తీవ్ర విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి, ఆమె కడుపులోని బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళనకు దిగారు.

Read Also : Hyderabad Crime: సీజ్ చేసిన ఫోన్ నుంచే రూ.1.70 లక్షలు కాజేసిన కానిస్టేబుల్

 Tragedy at Shadnagar Government Hospital: Mother and baby die after arrival for childbirth

Shadnagar Govt Hospital: నార్మల్ డెలివరీ పేరుతో కాలయాపన.. ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధ అనే నిండు గర్భిణికి నొప్పులు రావడంతో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నార్మల్ డెలివరీ అవుతుందని, కొద్దిసేపు వేచి ఉండాలని చెప్పిన వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

ప్రసవ నొప్పుల కోసం గ్లూకోజ్ ఎక్కించినప్పటికీ, గర్భంలోని శిశువు పరిస్థితిని కానీ, తల్లి ఆరోగ్య స్థితిని కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని బంధువులు ఆరోపించారు. సాయంత్రం 5:30 గంటల వరకు ఎలాంటి సరైన చికిత్స అందించకుండా కాలయాపన చేశారని తెలిపారు.

ఆసుపత్రిలోనే మృతి

సమయం గడుస్తుండగా రాధ పరిస్థితి పూర్తి విషమించి, నోటి నుంచి నురగలు వస్తూ ఆమె కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ వస్తున్నాయని, ఇక్కడ చికిత్స సాధ్యం కాదని చెప్తూ వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే షాద్‌నగర్ ఆసుపత్రిలోనే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన తర్వాత కూడా సీపీఆర్ చేసినట్లు నటించి తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు.

అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వాహనంలో తరలింపు.. ఆసుపత్రి ఎదుట ధర్నా

తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వ అత్యవసర అంబులెన్స్ సదుపాయం కల్పించలేదని బాధితులు పేర్కొన్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.9,000 చెల్లించి ప్రైవేట్ అంబులెన్స్‌లో రాధను హైదరాబాద్‌కు తరలించామని, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత పరీక్షించిన వైద్యులు అప్పటికే తల్లీబిడ్డలిద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారని కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ఘోరానికి బాధ్యులైన డాక్టర్లు, సంబంధిత సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

పొలంలోకి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు.. విద్యుత్ షాక్‌తో దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha