భూపాలపల్లిలో దారుణ ఘటన
Bhupalpally Crime : భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆగ్రహంతో అతని స్వంత కొడుకులే దాడి చేయడంతో అతడు మృతి చెందాడు.
జిల్లాలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం ఈ విషయం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది.
కుటుంబ వివాదాల నేపథ్యం
చేరాలకు భార్య, కవల కుమారులు రామ్, లక్ష్మణ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం తన గ్రామానికే చెందిన ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. దీంతో పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చి మళ్లీ అదే మహిళ ఇంట్లో ఉండటం ప్రారంభించాడు.
Read Also:Patriot Trailer Release: ఇద్దరు సూపర్ స్టార్ల విశ్వరూపం..'పేట్రియాట్' ట్రైలర్ రిలీజ్
Bhupalpally Crime దాడి చేసి ఆసుపత్రికి తరలింపు
తండ్రి మూడు రోజులుగా ఫోన్లకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుమారులు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. ప్రియురాలి ఇంట్లో తండ్రిని చూసి కోపంతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చేరాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

