Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే

భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే

వార్త 1 week ago

Bhuvanagiri fort Development: చారిత్రాత్మక భువనగిరి కోట అభివృద్ధి పనులను అక్టోబర్ 2వ తేదీలోగా పూర్తిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను గట్టిగా ఆదేశించారు.

సోమవారం భువనగిరి కోట వద్ద పర్యటించిన ఆయన.. అక్కడ శరవేగంగా కొనసాగుతున్న వివిధ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమీక్షించారు. అవసరమైతే రాత్రింబవళ్లు షిఫ్టుల వారీగా పనులు చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Read also: kukatpally Tree falls on car: కూకట్‌పల్లిలో కారుపై విరిగిపడిన భారీ చెట్టు!

 New attraction for Bhuvanagiri Fort: Ropeway to be operational by October.

Bhuvanagiri fort Development: ఆధునిక పర్యాటక సదుపాయాల పరిశీలన

ఈ పర్యటనలో భాగంగా కోట వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రోప్‌వే పనులతో పాటు పర్యాటక హోటల్, పార్కింగ్‌, మరుగుదొడ్లు, చిన్నారుల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫ్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ వంటి సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని జూపల్లి తెలిపారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూనే భువనగిరి కోటను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని, యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక-వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు.

స్వదేశ్ దర్శన్ కింద రూ.56.81 కోట్లతో భారీ ప్రాజెక్టు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘స్వదేశ్ దర్శన్ 2.0’ పథకం కింద రూ.56.81 కోట్లతో 'భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియెన్షియల్ జోన్' ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని మంత్రి జూపల్లి వివరించారు. ఈ నిధులలో రూ.17.91 కోట్లతో 1,020 మీటర్ల పొడవైన అత్యాధునిక రోప్‌వేను నిర్మిస్తున్నారు. గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన నిధులతో రోడ్లు, వ్యూయింగ్ గ్యాలరీ, విద్యుదీకరణ, తాగునీటి సదుపాయాలు, సీసీ కెమెరాలు, హై-సెక్యూరిటీ సిస్టమ్స్ మరియు వారసత్వ కట్టడాల పునరుద్ధరణ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha