Chandrasekhar Reddy: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న భూవివాదంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పూర్తి స్పష్టతనిచ్చారు.
ఇటీవల కాలంలో తనపై మరియు తన కుటుంబంపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అందులో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వెల్లడి
ఆ వివాదాస్పద భూమికి సంబంధించిన అన్ని హక్కులు తమకే స్పష్టంగా ఉన్నాయని, దానికి తగిన లీగల్ డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద పక్కాగా ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాము ఎలాంటి అక్రమ మార్గాల్లో భూమిలోకి ప్రవేశించలేదని పేర్కొన్నారు. తాను, మరో వ్యక్తి అయిన సునీల్ కలిసి నానక్‌రామ్‌గూడలోని అసలైన రైతుల దగ్గరే ఆ భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు.
Chandrasekhar Reddy: గేట్లు పగులగొట్టారన్న ఆరోపణల్లో నిజం లేదు
భూమి వద్ద ఉన్న గేట్లను తామే స్వయంగా పగులగొట్టారంటూ వస్తున్న ప్రచారమంతా అవాస్తవమని చంద్రశేఖర్ రెడ్డి తేల్చిచెప్పేశారు. ఇతరుల ఆస్తులను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, కేవలం తమకు చట్టపరంగా హక్కు ఉన్న భూమి విషయాలను మాత్రమే తాము మాట్లాడమన్నారు. నిరాధారమైన ఆరోపణలతో కొందరు కావాలనే తమ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

