Minister Seethakka: తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ప్రదర్శించిన తీరుపై, ముఖ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్ ,బీఆర్ఎస్ పార్టీ నేతలు సమాజంలో అసభ్య పదజాలం (బ్యాడ్ లాంగ్వేజ్) ఉపయోగించడంలో బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారని విమర్శించారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన సభాధిపతి స్థానంలో ఉన్న ఒక దళిత నేతను అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని ధ్వజమెత్తారు.
Read Also: CM Revanth Reddy: అసెంబ్లీలో బీజేపీ వైఖరిపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Seethakka is the brand ambassador for BRS’s foul language.
Minister Seethakka: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత, అవమానకర పదజాలం ఉపయోగించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, అలాగే నవీన్ రెడ్డిలపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని మంత్రి సీతక్క శాసనసభ సాక్షిగా డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘించి రాజ్యాంగ పదవులను కించపరిచే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీ గేటు వద్ద నాటకీయ పరిణామాలు
సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు (Black T-Shirts) ధరించి శాసనసభ ప్రవేశ ద్వారంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే సభా నిబంధనలకు విరుద్ధంగా నిరసన దుస్తులతో రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరగడం వల్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్యలోనే ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో సభలో నిరసన వ్యక్తమైంది.
Epaper: epaper.vaartha.com

