Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ శాసనసభలో కంటతడి పెట్టుకున్న స్పీకర్, సీతక్క

తెలంగాణ శాసనసభలో కంటతడి పెట్టుకున్న స్పీకర్, సీతక్క

వార్త 3 weeks ago

Telangana Assembly Row: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో సోమవారం తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభాపతిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మధ్యాహ్నం సభలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా చైర్‌లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురై సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న తనను, తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడంపై ఆయన సభ సాక్షిగా తీవ్రంగా పరితపించారు.

Read Also: CM Revanth Reddy : స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

 Speaker and Seethakka tear up in the Telangana Legislative Assembly.

Telangana Assembly Row: ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. నోటితో పలకలేని అసభ్య పదజాలంతో సభాపతిని దూషించడం సభ్య సమాజానికే పట్టిన మచ్చ అని మండిపడ్డారు. స్పీకర్‌కు జరిగిన అవమానం తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని పేర్కొన్న సీఎం, తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేసి, ఆయనను డిస్మిస్ చేయాలని సభ దృష్టికి తెచ్చారు. ఇక బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌పై అభ్యంతరకర భాష వాడిన సభ్యుడిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.

మంత్రి సీతక్క ఆవేదన.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

మరోవైపు ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతుండగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. అణగారిన వర్గానికి చెందిన బిడ్డ అత్యున్నత పదవిలో కూర్చోవడమే ఆయన తల్లి చేసిన నేరమా అని నిలదీశారు. అందరినీ సమానంగా చూసుకునే స్పీకర్ తల్లిని బీఆర్ఎస్ సభ్యులు దూషించడం పట్ల ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

Epaper: epaper.vaartha.com

అసెంబ్లీలో బీజేపీ వైఖరిపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha