TG debts calculation: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల లెక్కలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.
మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. గులాబీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నాటి ఆర్థిక వ్యవహారాల చిట్టాను భట్టి విక్రమార్క సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. తమ పదేళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావులు ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Telangana Rythu Bharosa: కొత్త పాస్ బుక్ రైతులకు అలర్ట్.. రైతు భరోసాకు 2 రోజులే ఛాన్స్!
Debt of Rs 8.21 lakh crore during BRS regime: Bhatti Vikramarka
TG debts calculation: రూ.8.21 లక్షల కోట్ల భారీ అప్పుల కుప్ప
గత కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని అధికారిక లెక్కలను వెల్లడించారు. ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి చెల్లించకుండా వదిలేసిన వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ సాగించిన పాలన అంతా అబద్ధాల పునాదులపైనే నడిచిందని విమర్శించిన భట్టి.. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ అనాలోచిత అప్పుల కారణంగా కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి రూ.2,08,061 కోట్లు చెల్లించాల్సి వస్తోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తోందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అధిక వడ్డీ అప్పులను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ‘రీస్ట్రక్చరింగ్’ చేసిందని, తద్వారా వార్షిక వడ్డీ భారాన్ని రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు భారీ ఊరట కలిగించామని వివరించారు.
సింగరేణి సంక్షోభం.. బొగ్గు మాయంపై విజిలెన్స్ విచారణ
ఆర్థిక అప్పులే కాకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి హయాంలో కొత్తగా ఒక్క కోల్ బ్లాక్ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. గత పాలనలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు. సంస్థను పునరుద్ధరించేందుకు, కొత్త కోల్ బ్లాకుల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com
ఎల్‌నినో ప్రభావంతో నిలిచిన సాగు పనులు - వలసల బాటలో పాలమూరు కూలీలు

