Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు

వార్త 1 month ago

Marri Janardhan Reddy: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.

Read Also: AP TS school holidays: విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు

 Case registered against BRS leader Marri Janardhan Reddy.

Marri Janardhan Reddy: ఆసుపత్రి ఎదుట ధర్నా, రాస్తారోకో

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించి ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం వారు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

ధర్నా సమయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్ల చివరి విడత డబ్బులు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha