Hyderabad crime: హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాద ఘటన వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేసిన మోసం, కన్నబిడ్డను వేరొకరికి అమేసిందన్ననిజాన్ని తట్టుకోలేక ఒక యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.
Wife sells child and marries another man.. Husband commits suicide out of resentment
Hyderabad crime: ప్రేమ వివాహం.. ఆపై మనస్పర్థలు
నాలుగేళ్ల క్రితం కోహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఇష్టపూర్వకంగానే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వారు తుర్కయంజాల్‌లో కాపురం పెట్టారు. ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న సమయంలో, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ మహిళ బిడ్డను మరొకరికి అమ్మేసి, తాను వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నానని గోవర్ధన్‌కు సమాచారం అందించింది.
సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య
కట్టుకున్న భార్య అంత పెద్ద మోసానికి ఒడిగట్టడం, కన్నబిడ్డను కూడా డబ్బుల కోసం విక్రయించిందనే విషయం తెలిసి గోవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురై.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, చనిపోవడానికి ముందు అతడు తన సెల్ ఫోన్‌లో ఒక వీడియోను రికార్డ్ చేశాడు. అందులో తన భార్య చేసిన మోసాలు, వారి పెళ్లికి సంబంధించిన విషయాలు, తమ కుమారుడిని అమ్మేసిన ఉదంతాన్ని కన్నీళ్లతో వివరించాడు.
ఆధారాలను సేకరించిన కుటుంబ సభ్యులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ నిందితురాలైన భార్యను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ గోవర్ధన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నా కొడుకు ఎలాగూ తిరిగి రాడు.. కనీసం నా మనవడైనా ఎక్కడున్నాడో వెతికి మాకు అప్పగించండి” అంటూ గోవర్ధన్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
"నా దగ్గరకు రా" పరీక్ష పేపర్ ఇస్తా.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్

