Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"నా దగ్గరకు రా" పరీక్ష పేపర్ ఇస్తా.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్

"నా దగ్గరకు రా" పరీక్ష పేపర్ ఇస్తా.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్

వార్త 3 months ago

Lucknow University: విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారిన వైనం లక్నో యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది.

పరీక్షా పత్రాలను లీక్ చేస్తాననే నెపంతో, ఒక బీఎస్సీ విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్. బాధితురాలు ధైర్యంగా ప్రొఫెసర్ బాగోతాన్ని ఆడియో రికార్డింగుల రూపంలో బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Read Also: Pradeep Meghwal Rajasthan: సీటు ఖాయమనుకున్న వేళ.. అనంతలోకాలకు ప్రదీప్ మేఘ్వాల్

 Professor sexually harasses student on the pretext of giving him an exam paper

Lucknow University: ఆడియోలో ప్రొఫెసర్ అసభ్య సంభాషణ

యూనివర్సిటీలోని జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పరంజీత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. “డార్లింగ్, నీ కోసం రెండు క్వశ్చన్ పేపర్లు ఏర్పాటు చేశాను. పరీక్షకు ముందే నా దగ్గరికి రా, ఇక్కడే నీకు ఇస్తాను. నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?” అని ఆయన చెప్పినట్లుగా ఆడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది.

చదివేసానన్నా వినకుండా ఒంటరిగా రావాలని ఒత్తిడి

విద్యార్థిని స్పందిస్తూ.. “నేను సిలబస్ అంతా చదివేసాను సర్.. ఆ పేపర్లు నాకు అవసరం లేదు” అని చెప్పినా వినకుండా, పరీక్షలకు వారం రోజుల ముందే తనను ఒంటరిగా కలవాలని సదరు ప్రొఫెసర్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. గతంలో కూడా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, కేవలం తనను శారీరకంగా వేధించడానికే ప్రొఫెసర్ పిలుస్తున్నాడని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ ఖండించారు. యూనివర్సిటీలోని ‘అంతర్గత రాజకీయాల’ కారణంగా తనను ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలన్నింటినీ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ ఖండించారు. యూనివర్సిటీలోని ‘అంతర్గత రాజకీయాల’ కారణంగా తనను ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని వైస్ ఛాన్సలర్ జేపీ సైనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఆదేశించారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పాటిస్తామని యూనివర్సిటీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందిత ప్రొఫెసర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళనలు నిర్వహించింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మనవడిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు విడిచిన తాత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha