Telangana Beedi Workers: తెలంగాణ వ్యాప్తంగా బీడీలు చుట్టే సుమారు 7 లక్షల మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతూ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు, కంపెనీల ప్రతినిధుల మధ్య వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరింది. గతంలో ఉన్న జీతానికి అదనంగా వెయ్యి బీడీలకు 6 రూపాయలు పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో కార్మికుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వేతనాలు 2028 ఏప్రిల్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
Read also: Purchase of Grain : రైతు కంట కన్నీరు రాకూడదు - మెదక్ ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరిక
Beedi workers making beedis in TS
Telangana Beedi Workers: కొత్త వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి
ప్రస్తుతం బీడీ కార్మికులకు ప్రతి వెయ్యి బీడీలకు రూ.268.31 వస్తుండగా, తాజా పెంపుతో అది రూ.275.23కు చేరింది. బోనస్, సెలవుల జీతం అన్నీ కలుపుకుంటే సుమారు 15.33 శాతం మేర ఆదాయం పెరగనుంది. ఈ పరిశ్రమలో 98 శాతం మంది మహిళలే ఉండటం విశేషం, వీరంతా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ చర్చల ద్వారా ఈసారి మెరుగైన ఫలితం లభించింది. పెరిగిన వేతనాలతో సామాన్య కార్మిక కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుంది.
ఇతర విభాగాల ఉద్యోగులకూ లబ్ధి
బీడీలు చుట్టే వారితో పాటు ప్యాకర్లు, బట్టీవాలాలు, క్లర్కులు వంటి ఇతర సిబ్బందికి కూడా భారీగా జీతాలు పెరిగాయి. ప్యాకింగ్ చేసే కార్మికులకు నెలకు రూ.4,500 వరకు అదనపు వేతనం లభించనుంది. మిగిలిన విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు రూ.2,200 వరకు పెంపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 వేల మంది ఇతర సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగుతుంది. కార్మిక సంఘాల పోరాటం ఫలితంగానే యాజమాన్యాలు దిగి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో జీతాలు పెంచారని తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

