BSNL Freedom 2.0: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మరో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ 2.0' పేరుతో అందిస్తున్న ఈ ఆఫర్‌లో కేవలం రూ.1కే కొత్త సిమ్ కార్డు పొందే అవకాశం ఉంది.
అంతేకాకుండా సిమ్‌తో 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు అందిస్తున్నట్లు సమాచారం.
Read Also :Today gold rate: నేడు స్థిరంగా బంగారం ధరలు
అక్టోబర్ 12 వరకు ఆఫర్

ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12లోపు కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకునే వారికి లేదా ఇతర నెట్‌వర్క్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని సంస్థ తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వినియోగిస్తున్న ప్రస్తుత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు.
24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్
ఫ్రీడమ్ 2.0 ఆఫర్‌లో భాగంగా రూ.1కే సిమ్ పొందడంతో పాటు 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 1GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, 100 ఉచిత SMSలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా సిమ్ తీసుకునే వారితో పాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేవారికి కూడా ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
ఎక్కడ పొందాలంటే?
ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. గుర్తింపు పొందిన బీఎస్‌ఎన్‌ఎల్ రిటైలర్ల వద్ద కూడా సిమ్ లభించే అవకాశం ఉంది. సిమ్ యాక్టివేషన్ కోసం ఆధార్‌తో పాటు అవసరమైన KYC వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1800-180-1503ను సంప్రదించవచ్చు. అలాగే BSNL New Selfcare App ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
BSNL Freedom 2.0: కొత్త కస్టమర్లే లక్ష్యంగా..
ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరల్లో సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు పరిమిత కాల ఆఫర్లను తీసుకొస్తోంది. దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో 'ఫ్రీడమ్ 2.0' ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత మంది వినియోగదారులను తమ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

