Bihar Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్ ప్రమాద ఘటన మరువకముందే.. బిహార్‌లో మరో అగ్నిప్రమాద విషాదం చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ జిల్లాలోని 'ప్రసాద్ హాస్పిటల్'లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఐసీయూ (ICU) విభాగం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో ఊపిరాడక ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.
Muzaffarpur Prasad Hospital Fire
read also:Narendra Modi: కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
రోగులను గాలికొదిలేసి సిబ్బంది పరార్!
ప్రమాదం జరిగిన సమయంలో రోగులను రక్షించాల్సిన ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. మంటలు అంటుకోగానే రోగులను అలాగే వదిలేసి వారంతా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఐసీయూలో చిక్కుకున్న రోగులు దట్టమైన పొగలో కదలలేక, ఊపిరి పీల్చుకోలేక తీవ్ర నరకయాతన అనుభవించారు.
Bihar Fire Accident: ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది..
ఫైర్ ఆఫీసర్ ఆర్.ఎన్.పాండే తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదంపై సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఐసీయూ అంతా పొగమయంగా మారింది. రెస్క్యూ టీమ్‌లు ఆసుపత్రికి చేరుకునే సమయానికి అక్కడ ఒక్క ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
20 మందికి పైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా రోగులు గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది వారిని అత్యవసరంగా భవనం నుండి బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతదేహాన్ని కూడా ఇవ్వకుండా బోర్డు తిప్పేశారు!
ఆసుపత్రి యాజమాన్యం తీరుపై బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న తన తండ్రి ఈ ప్రమాదంలోనే చనిపోయాడని, కనీసం మృతదేహాన్ని అప్పగించే నాథుడు కూడా లేకుండా సిబ్బంది మొత్తం బోర్డు తిప్పేసి పారిపోయారని ఒక బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రమాదం తర్వాత రోగులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించడంతో, తమ వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రంగంలోకి జిల్లా యంత్రాంగం
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ (DM) సుబ్రత్ కుమార్ సేన్ స్పందించారు. మరణించిన ముగ్గురి మృతదేహాలు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాయని, ప్రమాద సమయంలో అక్కడ చికిత్స పొందుతున్న రోగుల పూర్తి వివరాలను, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. సివిల్ సర్జన్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
తిరుమల కల్తీ నెయ్యి కేసు: ఈడీ యాక్షన్.. 6 రాష్ట్రాల్లో సోదాలు!

